Share News

పచ్చి కొబ్బరితో ప్రయోజనాలెన్నో..

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:52 AM

పచ్చి కొబ్బరిని ఇష్టపడని వారుండరు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

పచ్చి కొబ్బరితో ప్రయోజనాలెన్నో..

పచ్చి కొబ్బరిని ఇష్టపడని వారుండరు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

  • పచ్చి కొబ్బరిలో ఉండే పీచు జీర్ణక్రియను వేగవంతం చేసి పొట్టను శుభ్రం చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది.

  • దీనిలో ఉండే మీడియం చెయిన్‌ ట్రై గ్లిసరైడ్స్‌.. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. గుండెకు అవసరమైన మంచి కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాలేయంలో పేరుకునే వ్యర్థాలను తొలగిస్తాయి.

  • కొబ్బరిలో ఉండే లారిక్‌ ఆమ్లం.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

  • దీనిలో బి, ఇ విటమిన్లతోపాటు మాంగనీస్‌, జింక్‌, పొటాషియం, కాపర్‌, ఐరన్‌, సిలీనియం లాంటి మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాల వృద్ధికి తోడ్పడతాయి. మెదడును చురుకుగా ఉంచుతాయి. చర్మం బిగుతుగా నిగారించేందుకు, శిరోజాలు ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తాయి.

  • తరచూ కొబ్బరి తినడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఉంటుంది. జీవక్రియలు వేగవంతమవుతాయి. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.

  • వ్యాయామం చేసినప్పుడు, ఆటలు ఆడిన తరువాత అధికంగా చెమట పట్టినట్లయితే పచ్చి కొబ్బరి తినడం మంచిది. దీని వల్ల శరీరానికి కావాల్సిన ఎలకొ్ట్రలైట్లు భర్తీ అవుతాయి.

  • పచ్చి కొబ్బరిని బెల్లంతో కలిపి తింటే శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా పెరిగి అలసట తగ్గుతుంది. రక్తంలో హెమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు

మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత

For More AP News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 06:05 AM