Anapakaya Seeds For Strong Immunity: అనపకాయ షిమ్ గింజలు తిందాం...
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:00 AM
చలికాలంలో విరివిగా దొరికే అనపకాయ గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...
చలికాలంలో విరివిగా దొరికే అనపకాయ గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...
అనపకాయ(షిమ్) గింజలను ఉడికించి తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె కండరాలు బలోపేతమవుతాయి. వీటిలో ఉండే పీచు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది
అనపకాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, అల్సర్, నులిపురుగులులాంటి సమస్యలు తీరుతాయి. వీటిలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి అధికంగా తినాలనే కోరికను తగ్గించి శరీరం బరువు పెరగకుండా నియంత్రిస్తాయి.
అనపకాయల్లో అధికంగా ఉండే డి విటమిన్, కాల్షియం, పాస్ఫరస్ లాంటి పోషకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దంతక్షయం నుంచి కాపాడతాయి. పొటాషియం, మాంగనీస్, జింక్ లాంటి మినరల్స్.. కండరాల తిమ్మిరిని తగ్గిస్తాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అనపకాయ గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు.. హార్మోన్లను సమతుల్యంలో ఉంచుతాయి. మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదం చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అకాల వార్థక్యాన్ని నిరోధిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్
For More AP News And Telugu News