Healthy Cooking Methods: పదార్థాలు... పోషకాలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:11 AM
కొన్ని పదార్థాల పోషకాలను సంపూర్తిగా పొందాలన్నా, వాటిలోని హానికారకాలను వదిలించుకోవాలన్నా కొన్ని సులువైన చిట్కాలు పాటించాలి. అవేంటంటే...
గుడ్ ఫుడ్
కొన్ని పదార్థాల పోషకాలను సంపూర్తిగా పొందాలన్నా, వాటిలోని హానికారకాలను వదిలించుకోవాలన్నా కొన్ని సులువైన చిట్కాలు పాటించాలి. అవేంటంటే...కొన్ని పదార్థాల పోషకాలను సంపూర్తిగా పొందాలన్నా, వాటిలోని హానికారకాలను వదిలించుకోవాలన్నా కొన్ని సులువైన చిట్కాలు పాటించాలి. అవేంటంటే...
అన్నం
అన్నంలోని ఆర్సినిక్ మోతాదును తగ్గించుకోవడం కోసం నేరుగా ఉడికించుకోకుండా, ఎక్కువ నీళ్లలో నానబెట్టి ఉడికించుకోవాలి.
దీంతో 80% ఆర్సినిక్ తగ్గిపోతుంది. అలాగే బియ్యానికి కొబ్బరినూనె జోడిస్తే, దాని గ్లైసెమిక్ మోతాదు తగ్గిపోతుంది. అలాగే వండిన అన్నాన్ని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు తినడం వల్ల కూడా గ్లైసెమిక్ మోతాదు తగ్గుతుంది
వెల్లుల్లి
వెల్లుల్లిని తరిగిన వెంటనే వంటల్లో వాడుకోకుండా, పది నిమిషాల తర్వాత వాడుకుంటే, దాన్లోని శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మూలకమైన అల్లిసిన్ మరింత పెరుగుతుంది
టమాటా
పచ్చి టమాటాలు తినడానికి బదులుగా, వాటిని ఆలివ్ నూనెలో ఉడికిస్తే, కణ గోడలు విచ్ఛిన్నమై, లైపోసీన్ శోషణ పెరుగుతుంది
నట్స్
వీటిని నేరుగా తినకుండా ఉప్పు నీళ్లలో 4 నుంచి 12 గంటలు నానబెట్టి తింటే, అజీర్తికి కారణమయ్యే వాటిలోని ఫైటిక్ ఆమ్లం విచ్ఛిన్నమవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ
Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News