వీటితో నీరసం మాయం...
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:56 AM
ఏ అనారోగ్యమూ లేకపోయినా, సమయానుసారం భోజనం చేసి నిద్రకు ఉపక్రమించినా ఒక్కోసారి నీరసం, నిస్సత్తువ ఆవహిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తినే ఆహారంలో కొన్ని మార్పులు...
ఏ అనారోగ్యమూ లేకపోయినా, సమయానుసారం భోజనం చేసి నిద్రకు ఉపక్రమించినా ఒక్కోసారి నీరసం, నిస్సత్తువ ఆవహిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.
తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. వేడి వేడి అన్నంలో పలుచగా తయారు చేసిన పప్పు లేదా ఏదైనా కూర కలుపుకుని తింటే వెంటనే నీరసం తగ్గుతుంది.
వివిధ రకాల కూరగాయలు, మిరియాలతో తయారు చేసిన కిచిడీని తినడం వల్ల నిస్సత్తువ తగ్గుతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
వేడి వేడిగా వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు, నీరు లభిస్తాయి. ఉత్సాహంగా అనిపిస్తుంది.
మధ్యాహ్న భోజనం చివరలో పెరుగన్నం తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రాత్రి పడుకునేముందు ఒక గ్లాసు పలుచని మజ్జిగా తాగితే ఉదయానికల్లా నిరసం మాయమవుతుంది.
నీరసంగా అనిపించినప్పుడు అరటిపండు తింటే వెంటనే ప్రయోజనం కనిపిస్తుంది. జంక్ ఫుడ్‌కు బదులు విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్‌తో కూడిన పోషకాహారాన్ని తీసుకుంటే ఎప్పుడూ చురుకుగా, ఉత్సాహంగా ఉండవచ్చు.
ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం మానకూడదు. దాహంగా అనిపించకపోయినా కనీసం రెండు గంటలకు ఒకసారైనా గ్లాసుడు మంచినీళ్లు తాగుతూ ఉండాలి.
శరీరంలో డి విటమిన్ లోపించినా నీరసంగా అనిపిస్తుంది కాబట్టి తృణధాన్యాలు, పాలు, గుడ్లు, చేపలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News