Finger Piercing Trend: వేలికీ ఓ పుడక
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:12 AM
ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడు ఏ వింత పుట్టుకొస్తుందో ఊహించడం కష్టం. నిన్నటి వరకు ముక్కుకో, చెవికో పియర్సింగ్ చేయించుకోవడం ఒక ట్రెండ్. అయితే ఇప్పుడు అది ఏకంగా వేలి వరకు పాకింది....
ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడు ఏ వింత పుట్టుకొస్తుందో ఊహించడం కష్టం. నిన్నటి వరకు ముక్కుకో, చెవికో పియర్సింగ్ చేయించుకోవడం ఒక ట్రెండ్. అయితే ఇప్పుడు అది ఏకంగా వేలి వరకు పాకింది. హాలీవుడ్ పాప్‌స్టార్ కాన్యే వెస్ట్, సోషల్ మీడియా సంచలనం కిమ్ కర్దాషియన్ల ముద్దుల కుమార్తె నార్త్‌వెస్ట్ తన వేళ్లకు ‘పియర్సింగ్’ చేయించుకుని డైమండ్ స్టడ్ అమర్చుకుంది.
హద్దులు దాటుతున్న ఫ్యాషన్ పిచ్చి
11 ఏళ్ల నార్త్‌వెస్ట్ వింత ప్రయోగం ఆశ్చర్యంతోపాటు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. వేలిపై ఉండే చర్మం అత్యంత సున్నితమైనది కాబట్టి అక్కడ పియర్సింగ్ వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం నిత్యం చేసే పనుల వల్ల ఆ వజ్రం ఎక్కడైనా తగిలి చర్మం తెగిపోయే అవకాశం కూడా ఉంది. చిన్న వయసు కావడంతో అంతటి నొప్పిని భరించి మరీ ఈ రిస్కీ స్టైల్ అవసరమా అని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. స్టైల్ కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
వారసత్వంగా గ్లామర్
నిజానికి కర్దాషియన్ కుటుంబానికి ఇలాంటి విలాసవంతమైన ఫ్యాషన్లు కొత్తేమీ కాదు. గ్లామర్ ప్రపంచంలో పెరిగిన నార్త్‌వెస్ట్ తన తల్లి కిమ్ కర్దాషియన్ అడుగుజాడల్లో నడుస్తూ చిన్నతనం నుంచే వార్తల్లో నిలిచేందుకు ఇష్టపడుతోంది. గతంలో ఆమె తన పళ్లకు వజ్రాలు పొదిగిన గ్రిల్స్ ధరించి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇప్పుడు ఈ ‘ఫింగర్ పియర్సింగ్’తో తాను కూడా ఒక స్టైల్ ఐకాన్ అని నిరూపించుకోవాలని తాపత్రయపడుతోంది.
అందం వ్యక్తిగతమే అయినా..
అందం అనేది వ్యక్తిగత ఇష్టమే అయినప్పటికీ అది ఆరోగ్యానికి హాని కలిగించనంత వరకు మాత్రమే ముచ్చటగా ఉంటుంది. సెలబ్రిటీల పిల్లలు చేసే ఇలాంటి పనులు ఇతర చిన్నారుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందం కోసం సురక్షితం కాని మార్గాలను ఎంచుకోవడం సరైనది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News