Share News

పరిమితికి మించి వాడితే...

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:39 AM

మనం రోజూ వాడే వస్తువులు చూడడానికి బాగానే ఉన్నాయని ఏళ్లు గడిచినా మార్చకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వివరాలు... దువ్వెనలు, హెయిర్‌ బ్రష్‌లను ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినప్పటికీ తలలో ఇన్ఫెక్షన్లను కలిగించి శిరోజాలు రాలడానికి కారణమవుతుంటాయి.

పరిమితికి మించి వాడితే...

మనం రోజూ వాడే వస్తువులు చూడడానికి బాగానే ఉన్నాయని ఏళ్లు గడిచినా మార్చకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వివరాలు...

  • దువ్వెనలు, హెయిర్‌ బ్రష్‌లను ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినప్పటికీ తలలో ఇన్ఫెక్షన్లను కలిగించి శిరోజాలు రాలడానికి కారణమవుతుంటాయి. కాబట్టి వీటిని ఆర్నెల్ల నుంచి ఏడాది లోపు తప్పనిసరిగా మార్చేయాలి.

  • వాడుతున్న కొద్దీ టూత్‌ బ్రష్‌ మెత్తగా మారి దంతాలను సరిగా శుభ్రం చేయలేదు. దీంతో హానికారక బ్యాక్టీరియాలు చేరి నోటి సమస్యలను కలిగిస్తాయి. అందుకే టూత్‌బ్ర్‌షను మూడు నెలలకు మించి ఉపయోగించకూడదు.

  • తువాళ్లు, దిండు గలీబులు పాతబడే కొద్దీ వాటి మీద ఫంగస్ చేరి తుమ్ములు, అలెర్జీలు, చర్మ వ్యాధులు, మొటిమలు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి వాటిని రెండేళ్లకు మించి వాడకూడదు.

  • నాన్‌స్టిక్‌ పాత్రలు, ప్యాన్‌లను ఏళ్ల తరబడి వాడుతుంటే వాటి మీద ఉండే టెఫ్లాన్‌ కోటింగ్‌ ఊడి ఆహార పదార్థాల్లో కలిసి కాలేయ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి వాటిని రెండేళ్లలోపు మార్చేయాలి.

  • ఇంట్లో వేసుకునే మెత్తటి చెప్పులు, స్లిప్పర్స్‌ మీద కూడా సూక్ష్మక్రిములు చేరుతుంటాయి. నెలల తరబడి వాటిని శుభ్రం చేయని పక్షంలో పాదాలకు ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. ఆ చెప్పుల అడుగు భాగాలు అరిగిపోయి వెన్నుమీద ఒత్తిడి పడుతుంది కూడా. కాబట్టి వాటిని ఆర్నెల్లకోసారి మార్చేయాలి.

  • వాటర్‌ బాటిల్స్‌ను ఉపయోగిస్తున్న కొద్దీ వాటి మీద కంటికి కనిపించని పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఆ పగుళ్లలో హానికారక బ్యాక్టీరియాలు చేరి నీటిలో కలుస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు జీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి వాటర్‌ బాటిల్స్‌ను మూడు నెలలకు మించి వాడకూడదు.

ఇవీ చదవండి:

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్‌' వృద్ధి: మోదీ

పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!

Updated Date - Sep 13 , 2026 | 12:39 AM