Share News

పెనం మాడిందా...

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:35 AM

వాడుతున్న కొద్దీ పెనం మాడిపోతూ ఉంటుంది. దానిమీద పిండి కణాలు అతుక్కుని నూనె జిడ్డు పేరుకుపోతూ ఉంటుంది. అలాంటప్పుడు...

పెనం మాడిందా...

వాడుతున్న కొద్దీ పెనం మాడిపోతూ ఉంటుంది. దానిమీద పిండి కణాలు అతుక్కుని నూనె జిడ్డు పేరుకుపోతూ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో పెనాన్ని సులువుగా శుభ్రం చేయవచ్చు.

  • ముందుగా పెనాన్ని స్టవ్‌ మీద పెట్టి కొద్దిగా వేడి చేయాలి. తరువాత స్టవ్‌ మీద నుంచి దించి దానిమీద కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లాలి. వెంటనే మధ్యకు కోసిన నిమ్మ చెక్కతో గుండ్రంగా రుద్దాలి. తరువాత రెండు చుక్కలు డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ వేసి స్క్రబ్బర్‌తో రుద్దితే మురికి, జిడ్డు వదిలి పెనం శుభ్రపడుతుంది.

  • పెనం మీద కొద్దిగా వైట్‌ వెనిగర్‌ను చిలకరించాలి. దానిపై చెంచా ఉప్పును చల్లి పావుగంటసేపు నాననివ్వాలి. దీంతో పెనం మీద పేరుకున్న జిడ్డు మొత్తం కరుగుతుంది. తరువాత వేడినీళ్లు పోసి స్క్రబ్బర్‌తో తోమితే పెనం చక్కగా మెరుస్తుంది.

  • పెనాన్ని స్టవ్‌ మీద పెట్టి వేడిచేయాలి. దానిమీద ఉప్పు చల్లి కాగితంతో రుద్దితే చాలా వరకు జిడ్డు తొలగిపోతుంది.

  • పెనాన్ని వాడిన తరువాత వేడిగా ఉన్నప్పుడే మెత్తటి స్పాంజ్‌ లేదా గుడ్డతో తుడవాలి. తరువాత వేడినీళ్లు పోసి కడిగేస్తే సరిపోతుంది.

  • పెనం మీద రెండు చుక్కల డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ వేసి స్క్రబ్బర్‌తో మెల్లగా రుద్ది ఆపైన నీళ్లతో శుభ్రం చేసినా ఫలితం ఉంటుంది.

Also Read:

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 01:35 AM