నేటి అలంకారం శ్రీ దుర్గాదేవి
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:35 AM
శశరన్నవరాత్రి మహోత్సవాల్లో ఎనిమిదో రోజున శ్రీ దుర్గాదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడి..
దేవీ నవరాత్రులు
ఆశ్వయుజ శుద్ధ అష్టమి
(దుర్గాష్టమి), ఆదివారం
శశరన్నవరాత్రి మహోత్సవాల్లో ఎనిమిదో రోజున శ్రీ దుర్గాదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని ఈ అష్టమి తిథి రోజునే సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ అష్టమిని ‘దుర్గాష్టమి’ అని వ్యవహరిస్తారు. ‘దుర్గే దుర్గతినాశని’... ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందనీ, కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయనీ, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందనీ నమ్మిక. ఆయురారోగ్యాలను ప్రసాదించే దివ్యరూపిణి దుర్గమ్మ దర్శనం సకల శ్రేయోదాయకం.
నైవేద్యం: గారెలు, చిత్రాన్నం
అలంకరించే చీర రంగు: ఎరుపు
అర్చించే పూల రంగు: గులాబీలు, ఎర్రటిపూలు, కుంకుమ, ఎర్రటి అక్షతలు
పారాయణ: దుర్గా సూక్తం, దుర్గా సప్తశ్లోకి
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News