Share News

Christs Birth And Divine Path: క్రీస్తు జననం తరువాత...

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:38 AM

ఒక గొప్ప సంఘటన కొందరిలో అభిమానాన్ని, ఆరాధనను, మరికొందరిలో అసూయను, ద్వేషాన్ని కలిగించడం అరుదే కాని అసంభవం కాదు. ఏసు జననం అలాంటి సంఘటన. జనాభా లెక్కలలో తమ పేర్లు నమోదు...

Christs Birth And Divine Path: క్రీస్తు జననం తరువాత...

దైవమార్గం

ఒక గొప్ప సంఘటన కొందరిలో అభిమానాన్ని, ఆరాధనను, మరికొందరిలో అసూయను, ద్వేషాన్ని కలిగించడం అరుదే కాని అసంభవం కాదు. ఏసు జననం అలాంటి సంఘటన. జనాభా లెక్కలలో తమ పేర్లు నమోదు చేసుకోవడం కోసం నజరేతు నుంచి బెత్లెహేముపురానికి యేసేపు, మరియ దంపతులు వచ్చారు. అక్కడ క్రీస్తుకు మరియ జన్మనిచ్చింది. ఆ తరువాత వారు మళ్ళీ నజరేతుకు వెళ్ళిపోవాల్సి ఉంది. అయితే ప్రభువు పుట్టాడనే శుభవార్తను విన్న పశువుల కాపరులు వచ్చి, ఆ బాలుణ్ణి చూసి వెళుతున్నారు. ఏసు పుట్టుకలోని విశేషం గురించి ఆనోటా, ఈనోటా విన్నవారందరూ వచ్చిపోతున్నారు. పైగా మరియ పచ్చి బాలింతరాలు. అప్పట్లో ప్రయాణాలకు సరైన సౌకర్యాలు లేవు. దానితో ఆ దంపతులు వెనక్కి వెంటనే వెళ్ళలేకపోయారు.

ఈలోగా... ఎప్పటినుంచో ప్రభువు జననం కోసం కలలుకంటున్న ముగ్గురు జ్ఞానులు ఆ సంకేతాలు తెలుసుకున్నారు. దూరదూర తీరాల నుంచి ప్రయాణం సాగిస్తూ... మార్గమధ్యంలో హేరోదు రాజును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన సహకారాన్ని అర్థించారు. ‘రాజునైన నేను ఉండగా మరొక రాజు పుట్టడమా?’ అనే అసూయతో, ఆందోళనతో హేరోదు రగిలిపోయాడు. ‘ఆ రారాజు ఎక్కడ పుట్టాడు? అతని జాడ ఎక్కడ?’ అనే ఆత్రుత హేరోదులో పెరిగింది. ‘‘మీరు వెళ్ళి చూడండి. ఆ వివరాలు మాకు చెప్పడానికి తిరిగి రండి’’ అంటూ జ్ఞానులను అతను సాగనంపాడు. వారిని గమనించాలని భటులను పంపించాడు. మెల్కీయోర్‌, కాస్పర్‌, బాల్తజార్‌ అనే ఆ జ్ఞానులు ముగ్గురూ బెత్లెహేముపురానికి చేరారు. బాల ఏసును దర్శించుకున్నారు, బంగారం, సాంబ్రాణి, మిర్ర అనే సుగంధ పదార్థం కానుకలుగా సమర్పించారు. అవి ప్రభువులోని దైవ, మానవ స్వభావాలకు సూచనలని పండితుల అభిప్రాయం. జ్ఞానులు తిరిగి హేరోదు రాజు కోటకు చేరాలి. అటువైపు వారు వెళుతూ ఉండగా... దూతలు వారిని దారి మళ్ళించారు. దానితో జ్ఞానులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. రారాజు ఎక్కడ జన్మించాడో హేరోదుకు తెలియకపోవడంతో... దేశంలోని శిశువులను చంపించే దుష్కార్యానికి అతను ఒడిగట్టాడు.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఇవి కూడా చదవండి...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 12:38 AM