Share News

ధోతీ ధమాకా

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:59 AM

కుర్తీ అడుగున ధరించే బాటమ్స్‌, ట్రెండ్‌కు తగ్గట్టు మారిపోతూ ఉంటాయి. ప్రస్తుతం ‘ధోతీ ప్యాంట్‌’ తాజా ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారింది. ధోతీని తలపించే ఈ ప్యాంట్‌ ప్రత్యేకతలు...

ధోతీ ధమాకా

ఫ్యాషన్‌

కుర్తీ అడుగున ధరించే బాటమ్స్‌, ట్రెండ్‌కు తగ్గట్టు మారిపోతూ ఉంటాయి. ప్రస్తుతం ‘ధోతీ ప్యాంట్‌’ తాజా ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారింది. ధోతీని తలపించే ఈ ప్యాంట్‌ ప్రత్యేకతలు ఇవే!

  • కుర్తీ పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా... స్లీవ్స్‌ ఉన్నా, లేకున్నా ధోతీ ప్యాంట్‌ చక్కగా సూటవుతుంది. వీటిలో సాదావే ధరించాలనే నియమం లేదు. డిజైన్‌ ఉన్నవీ ఎంచుకోవచ్చు

  • అనార్కలి, అంబ్రెల్లా, స్ట్రెయిట్‌.... మోడల్‌ ఏదైనా కుర్తీకి కొత్త రూపం తీసుకురావాలంటే ధోతీ ప్యాంట్‌ ఎంచుకోవాలి. అయితే ఈ ప్యాంట్‌ ఎంచుకునేటప్పుడు, పొడవు చీలమండలం వరకూ ఉండేలా చూసుకోవాలి. కురచగా ఉంటేనే ఈ తరహా ప్యాంట్లు అందంగా కనిపిస్తాయి

  • క్యాజువల్‌ వేర్‌గా ధరించదగిన ఈ ప్యాంట్లకు శాండిల్స్‌, ఫ్లాట్స్‌ చక్కగా సూటవుతాయి. డ్రస్‌, సందర్భాలను బట్టి హై హీల్స్‌ కూడా వేసుకోవచ్చు

  • వేడుకల కోసం, సెక్విన్స్‌, ఎంబ్రాయిడరీ కలిగిన ధోతీ ప్యాంట్స్‌ ఎంచుకోవచ్చు

  • శాటిన్‌తో పాటు కాటన్‌ ధోతీ ప్యాంట్స్‌ను కూడా సందర్భానుసారంగా ఎంచుకోవచ్చు. వేసవిలో కాటన్‌ ధోతీ ప్యాంట్స్‌ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు

మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత

For More AP News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 06:03 AM