Share News

దారులు వేరు... గమ్యం ఒకటే

ABN , Publish Date - Jun 12 , 2026 | 03:18 AM

బైబిల్‌లో తోబుట్టువులైన మూడు పాత్రలు ప్రముఖంగా కనిపిస్తాయి. వారు మోషే, అతని అన్న ఆరోను, అక్క మిర్యాము. వారి తల్లిదండ్రులు అమ్రాము, యోకెబేదు....

దారులు వేరు... గమ్యం ఒకటే

దైవమార్గం

బైబిల్‌లో తోబుట్టువులైన మూడు పాత్రలు ప్రముఖంగా కనిపిస్తాయి. వారు మోషే, అతని అన్న ఆరోను, అక్క మిర్యాము. వారి తల్లిదండ్రులు అమ్రాము, యోకెబేదు. ఆ దంపతులు ఫరో రాజు కోటలో ఉన్నప్పుడు మోషే పుట్టాడు. ఫరో పాలన నుంచి ప్రజలను అతను విముక్తి చేశాడు. దేవుని ఆదేశం మేరకు.. పాలు, తేనె ప్రవహించే భూమిగా ప్రసిద్ధమయిన కనాను దేశం వైపు వారిని నడిపించాడు. అతని అన్న అయిన ఆరోను... ఇజ్రాయేలీయులకు తొలి పూజారిగా... వారిని ఆధ్యాత్మికతవైపు నడిపించాడు. అక్క మిర్యాము తన ఆట పాటలతో దేవుని మహిమలను కీర్తిస్తూ, జనాన్ని సాంస్కృతిక మార్గంలోకి నడిపించింది. వారు చేసిన కార్యాలు విభిన్నమైనవి. కానీ అవి ఒకే లక్ష్యంతో సాగాయి, ఒకే గమ్యానికి చేరాయి, ప్రజలను ఆ గమ్యానికి చేర్చాయి.

ఆ ముగ్గురూ ఐగుప్తుకి ఈశాన్య దిశగా బయలుదేరారు. ఎర్ర సముద్రం దాటారు, మారా, ఏలీము లాంటి అరణ్యాల్లోకి ప్రవేశించారు. దేవుడు తమకు పది ఆజ్ఞలు జారీ చేసిన సీనాయి పర్వతం దాటి... కనాను దేశ సరిహద్దు వరకు వెళ్ళారు. భవిష్యత్తులో ఏసు క్రీస్తు తిరుగాడబోయే యోర్దాను నదీ తీర ప్రాంతానికి చేరుకున్నారు. అదే దేవుడు చెప్పిన, ఇజ్రాయేలీయులు స్థిరపడిన కానాను దేశం. ఆ ప్రయాణంలో వారు ఏం తిన్నారో, ఎక్కడ విశ్రమించారో, తమను శ్రమ పెడుతున్నందుకు మోషేను జనం తిట్టారో, కొట్టారో, శాపనార్థాలు పెట్టారో, మెచ్చుకున్నారో తెలీదు గానీ... కానాను భూముల్లోకి వారు చేరుకోవడానికి నలభై రోజులు పట్టింది. వారిది ఒక చిన్న కుటుంబం. కానీ నాయకత్వానికి నాంది పలికిన కుటుంబం. నమ్ముకున్న సిద్ధాంతంవైపు వ్యక్తులుగా కానీ, సమష్టిగా కానీ ఎంతో నిబద్ధతతో ప్రవర్తించాలనీ, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా దైవాజ్ఞను నెరవేర్చాలనీ వారి కథ సూచిస్తోంది.

డాక్టర్‌ యం.సోహినీ బెర్నార్డ్స్‌

9866755024

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Jun 12 , 2026 | 03:18 AM