Share News

Boost Your Immunity Naturally: రోగ నిరోధకశక్తి పెంచుకోండిలా..

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:57 AM

ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోతుండటంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. సీజనల్‌ వ్యాధులు...

Boost Your Immunity Naturally: రోగ నిరోధకశక్తి పెంచుకోండిలా..

ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోతుండటంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. సీజనల్‌ వ్యాధులు అన్ని వయసుల వారినీ ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో చూద్దాం.

సమతుల ఆహారం: విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. ముఖ్యంగా సిట్రస్‌ పండ్లు (నిమ్మ, నారింజ), క్రూసిఫెరస్‌ కూరగాయలు (క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌) మేలు చేస్తాయి.

హైడ్రేషన్‌: చలికాలంలో దాహం వేయకపోయినా తగినంత నీరు తాగాలి.

వ్యాయామం: రోజుకు కనీసం అరగంట వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరిచి రోగ నిరోధక వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.

తగినంత నిద్ర: రోజుకు 7 నుంచి 9 గంటల గాఢ నిద్ర అవసరం.

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్

విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్

For More AP News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 01:57 AM