Share News

Bhogi Festival: నవ వసంతానికి ఆహ్వానమే భోగి

ABN , Publish Date - Jan 14 , 2026 | 05:33 AM

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైందంటే ముందుగా పలకరించేది భోగి పండుగే. చలిగాలులను తరిమికొడుతూ, పాత జ్ఞాపకాలను మంటల్లో కలుపుతూ...

Bhogi Festival: నవ వసంతానికి ఆహ్వానమే భోగి

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైందంటే ముందుగా పలకరించేది భోగి పండుగే. చలిగాలులను తరిమికొడుతూ, పాత జ్ఞాపకాలను మంటల్లో కలుపుతూ సాగే ఈ పండుగ వెనుక అద్భుతమైన పరమార్థం ఉంది. సంస్కృతంలోని ‘భుగ్‌’ అనే పదం నుంచి పుట్టిందే ‘భోగి’. ఇది సుఖసంతోషాలకు సంకేతం. సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ముందు రోజును ఆనందమయమైన భవిష్యత్తుకు నాందిగా మనం జరుపుకొంటాం. గోదాదేవి తన ఆరాధ్య దైవమైన శ్రీరంగనాథుడిలో లీనమై పరమానందాన్ని పొందిన పవిత్రమైన ఘడియలకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది.

శాస్త్రీయత

తెల్లవారుజామున వేసే భోగి మంటలు సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి రక్షాకవచం. ధనుర్మాసంలో సిద్ధం చేసిన ఆవు పిడకలు, రావి, మామిడి కట్టెలను మంటల్లో వాడటం వల్ల గాలి శుద్ధి జరిగి శ్వాసకోశ సమస్యలు దరిచేరవు. ఇక సాయంత్రం చిన్నారులపై కురిపించే రేగుపళ్ల వాన ఒక మధురమైన ఘట్టం. ‘సూర్య ఫలాలు’గా పిలిచే ఈ రేగుపళ్లను పిల్లల తలపై నుంచి పోయడం వల్ల వారిపై ఉన్న దిష్టి తొలగిపోవడమే కాకుండా, సూర్యభగవానుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

ఈ వార్తలు కూడా చదవండి..

రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?

బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 05:33 AM