Share News

గొడుగు మడతపెట్టి...

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:49 AM

వానల్లో వాడుకునే గొడుగుల్లో కూడా కొత్త ట్రెండ్స్‌ వచ్చేశాయి. సౌలభ్యంతో పాటు స్టైల్‌ను కూడా అందించే కొత్త రకం గొడుగులు ఈ వారం మీ కోసం...

గొడుగు మడతపెట్టి...

ఫ్యాషన్‌

వానల్లో వాడుకునే గొడుగుల్లో కూడా కొత్త ట్రెండ్స్‌ వచ్చేశాయి. సౌలభ్యంతో పాటు స్టైల్‌ను కూడా అందించే కొత్త రకం గొడుగులు ఈ వారం మీ కోసం...

బ్యాగుల్లో ఇమిడిపోయే పాకెట్‌ ఫ్రెండ్లీ గొడుగులు మొదలు భారీ వర్షాన్ని సైతం తట్టుకునే హెవీ డ్యూటీ గొడుగుల వరకూ ప్రస్తుతం మార్కెట్లో పలు వెరైటీలు దొరుకుతున్నాయి. 2 ఫోల్డ్‌, 3 ఫోల్డ్‌ ట్రావెల్‌ అంబ్రెల్లాల నుంచి దృఢంగా, పొడవుగా ఉండే కార్గిల్‌/కనోపి అంబ్రెల్లాలు, అలా్ట్ర స్మాల్‌ క్యాప్సూల్‌ అంబ్రెల్లాలు, మిర్రర్‌ వర్క్‌ అంబ్రెల్లాలు కూడా అందుబాటులోకొచ్చేశాయి.

2 ఫోల్డ్‌: మధ్యస్త పరిమాణంలో ఉండే ఈ గొడుగులు, సగానికి ముడుచుకుంటాయి. దృఢమైన హ్యాండిల్‌ కలిగి ఉండే ఈ గొడుగులు తేలికగా ఉంటాయి కాబట్టి సునాయాసంగా వెంట తీసుకెళ్లిపోవచ్చు.

3 ఫోల్డ్‌: ఎక్కువ ఆదరణ పొందే గొడుగులు ఇవి. మూడు సార్లు మడిచే సౌలభ్యం ఉంటుంది. కాబట్టి చిన్న పాటి హ్యాండ్‌బ్యాగుల్లో, బ్యాక్‌ప్యాక్స్‌లో చక్కగా ఇమిడిపోతుంది.

లాంగ్‌/స్ట్రెయిట్‌: సంప్రదాయ గొడుగులివి. మడతపెట్టే వీల్లేని ఈ గొడుగులు బలమైన ఈదురు గాలులను కూడా తట్టుకోగలుగుతాయి. కాబట్టి తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించేవాళ్లకు తగిన గొడుగులు ఇవే!

కనోపి/హెవీ రిబ్‌: 8 నుంచి 24 రిబ్స్‌ కలిగి ఉండే ఈ గొడుగులు కుంభవృష్టిని కూడా తట్టుకోగలిగేంత దృఢంగా ఉంటాయి.

గోల్ఫ్‌: ఎక్స్‌ట్రా లార్జ్‌ ఆర్క్‌ను కవర్‌ చేసే ఈ గొడుగులు ఒకరి కంటే ఎక్కువ మందికి వాన నుంచి రక్షణనిస్తాయి.

రివర్స్‌/సి టైప్‌: రివర్స్‌లో ముడుచుకునే ఈ గొడుగులు నీరు కారిపోకుండా ఉంటాయి. తడి వల్ల కార్ల ఇంటీరియర్‌ పాడవకుండా ఉండడం కోసం రూపొందిన గొడుగులు ఇవి.

క్రాఫ్ట్‌: అద్దాలు, ఎంబ్రాయిడరీ, కాటన్‌/సిల్క్‌ పనితనంతో కూడిన రాజస్థాన్‌, గుజరాత్‌ గొడుగులు కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి. తేలికపాటి జల్లులు కురుస్తున్నప్పుడు ఉపయోగించడానికి తగిన గొడుగులు ఇవి.

ఈ వార్తలు కూడా చదవండి..

పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు

For More National News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 02:49 AM