Share News

కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా...

ABN , Publish Date - May 09 , 2026 | 04:33 AM

కొత్త దుస్తులను కొన్న తరువాత వాటిని నేరుగా ధరించడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే...

కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా...

కొత్త దుస్తులను కొన్న తరువాత వాటిని నేరుగా ధరించడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే...

  • కొత్త దుస్తులు... ఫ్యాక్టరీలో తయారై గిడ్డంగులు, రిటైల్‌ షాపులకు చేరే క్రమంలో వాటిమీద దుమ్ము, ధూళి చేరుతూ ఉంటాయి. అలాంటి దుస్తులు ధరించడం వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు ఏర్పడవచ్చు. కాబట్టి కొత్త దుస్తులను కొద్దిసేపు నీటిలో నానబెట్టి ఉతికిన తరువాతనే ధరించడం మంచిది.

  • కొనేముందు నచ్చిన డ్రెస్‌ను ఒకసారి ట్రయల్‌ రూమ్‌లో ధరించి చూసుకుంటూ ఉంటాం. ఇలా ఒకే డ్రెస్‌ని చాలామంది ప్రయత్నించి ఉండవచ్చు. దీంతో ఆ డ్రెస్‌ మీద రకరకాలు బ్యాక్టీరియాలు చేరే ప్రమాదముంటుంది. అలాంటి దుస్తులు ధరించడం వల్ల దురద, దద్దుర్లు, డెర్మటైటిస్‌ లాంటి చర్మ వ్యాధులు రావచ్చు. కాబట్టి కొత్త డ్రెస్‌లను వాటిపైన సూచించిన ప్రకారం శుభ్రం చేసి మాత్రమే ధరించాలి.

  • చర్మాన్ని అంటిపెట్టుకునే ఇన్నర్‌ వేర్‌, స్ట్రెచబుల్‌ బ్లౌజులు, లెగ్గింగ్స్‌, జీన్స్‌ లాంటి వాటిని కొన్నవెంటనే ధరించడం వల్ల ఎగ్జిమా, స్కిన్‌ అలర్జీలాంటివి రావచ్చు. కాబట్టి వాటిని సరైన విధానంలో వాష్‌ లేదా డ్రైవాష్‌ చేసిన తరువాతనే ధరించాలి.

ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

Updated Date - May 09 , 2026 | 04:34 AM