Share News

అందానికి మెరుగులు

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:55 AM

ముఖానికి ఫేస్‌ ప్యాక్‌లు అప్లయ్‌ చేయడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం తేమతో నిండి చక్కగా నిగారిస్తుంది...

అందానికి మెరుగులు

ముఖానికి ఫేస్‌ ప్యాక్‌లు అప్లయ్‌ చేయడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం తేమతో నిండి చక్కగా నిగారిస్తుంది. వేసవిలో చర్మానికి తాజాదనాన్ని అందించి ముఖ సౌందర్యాన్ని పెంచే ఫేస్‌ ప్యాక్‌లు ఇవే...

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల తేనె, అర చెంచా నిమ్మరసం, చెంచా కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మం ఛాయతో మెరుస్తుంది.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, మూడు చెంచాల పాలు వేసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. వేలి కొనలతో గుండ్రంగా ముఖమంతా మర్దన చేయాలి. ఈ ప్యాక్‌ పూర్తిగా ఆరిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తూ ఉంటే ఎండ వేడి వల్ల ఏర్పడే ట్యాన్‌ తొలగిపోతుంది. చర్మం తేమతో నిండి బిగుతుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 05:55 AM