ఎండకు నల్లబడిన చర్మం కోసం...
ABN , Publish Date - May 09 , 2026 | 04:41 AM
సన్‌స్ర్కీన్స్ కూడా తీవ్రమైన ఎండ నుంచి చర్మాన్ని కాపాడలేకపోతూ ఉంటాయి. ఫలితంగా ఈ కాలంలో సన్ ట్యాన్ తప్పదు. అయితే ఎండకు నల్లబడిన చర్మాన్ని మేకప్‌తో దాచేసే...
మేకప్
సన్‌స్ర్కీన్స్ కూడా తీవ్రమైన ఎండ నుంచి చర్మాన్ని కాపాడలేకపోతూ ఉంటాయి. ఫలితంగా ఈ కాలంలో సన్ ట్యాన్ తప్పదు. అయితే ఎండకు నల్లబడిన చర్మాన్ని మేకప్‌తో దాచేసే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
కన్‌సీలర్: రంగు మారిన చర్మం మీద సన్నని గీతలు కూడా ఏర్పడతాయి. కాబట్టి వాటిని దాచడం కోసం చర్మపు రంగు కంటే తేలిక రంగులో ఉండే కన్‌సీలర్‌ను ఎంచుకోవాలి. ఈ కన్‌సీలర్‌ను తడిపి పిండిన బ్యూటీ బ్లెండర్ సహాయంతో చర్మం మీద అద్దుకోవాలి.
కలర్ కరెక్టర్: ఎండకు కమిలిపోయిన, రంగు మారిన చర్మం సహజసిద్ధ మెరుపును సంతరించుకోవడం కోసం కలర్ కరెక్టర్‌ను ఉపయోగించాలి. సన్ ట్యాన్‌కు గురైన ప్రదేశంలో పసుపు టోన్ కలిగిన కలర్ కరెక్టర్‌ను చర్మంలో కలిసిపోయేలా అద్దుకోవాలి. నుదురు, ముక్కు, చెక్కిళ్లు సన్‌ట్యాన్‌కు ఎక్కువగా గురవుతూ ఉంటాయి. ఆయా ప్రదేశాల్లో కలర్ కరెక్టర్‌ను అద్దుకుని, ఆ తర్వాతే మేకప్ మొదలుపెట్టాలి.
ఫౌండేషన్: ఎండకు కమిలిన చర్మం మరింత సున్నితంగా మారుతుంది. కాబట్టి చురుకైన రసాయనాలుండే ఫౌండేషన్లకు దూరంగా ఉండాలి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచే ఫౌండేషన్లను మాత్రమే వాడుకోవాలి. అందుకోసం మాయిశ్చరైజర్, ఎస్‌పిఎఫ్ కలిగిన ఫౌండేషన్‌నే ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా వేసవిలో ముదురు రంగు ఫౌండేషన్లనే వాడుకోవాలి.
బ్రాంజర్: ఎండకు కమిలిన చర్మం మీద ముదురు రంగు బ్రాంజ్ ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి లేత రంగులో ఉండే బ్రాంజ్‌ను ముక్కు, నుదురు, చెక్కిళ్ల మీద పూసుకోవచ్చు.
ఐషాడో: కనురెప్పలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం బంగారువర్ణం లేదా గోధుమరంగు ఐషాడోలను ఎంచుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ రంగుల షాడోలను ఉపయోగించేటప్పుడు, ముందుగానే రెండిటినీ బాగా కలుపుకుని, తర్వాత ఉపయోగించుకోవాలి. ప్రత్యామ్నాయంగా బ్రౌన్ కోల్ లేదా లైనర్ కూడా వాడుకోవచ్చు. బంగారువర్ణం ద్రవరూప ఐలైనర్ లేదా బంగారవర్ణం ఐషాడోలు కూడా వాడుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!
ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్