Share News

మెరుపు నిమిషాల్లో

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:19 AM

ఉన్నట్టుండి ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తే కంగారు పడకుండా, ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇలా మెరిసిపోండి....

మెరుపు నిమిషాల్లో

ఉన్నట్టుండి ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తే కంగారు పడకుండా, ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇలా మెరిసిపోండి.

కాంతివంతమైన చర్మం కోసం: ఫంక్షన్‌కు వెళ్లే ముందు ముఖం డల్‌గా అనిపిస్తే.. చెంచా కాఫీ పొడిలో కొంచెం తేనె కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మానికి తక్షణ కాంతిని ఇస్తాయి.

కళ్ల కింద నలుపు: బాగా అలసిపోయినప్పుడు కళ్లు ఉబ్బినట్టు అనిపిస్తే వాడేసిన గ్రీన్‌ టీ బ్యాగులను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి కళ్లపై పెట్టుకోండి. ఇది కళ్ల చుట్టూ ఉన్న నలుపు, వాపు తగ్గిస్తుంది.

లిప్‌స్టిక్‌ ఎక్కువసేపు ఉండాలంటే: లిప్‌స్టిక్‌ వేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్‌ను పెదవులపై ఉంచి దానిపై కొంచెం పౌడర్‌ అద్దండి. దీనివల్ల లిప్‌స్టిక్‌ మ్యాట్‌ ఫినిషింగ్‌తో పాటు రోజంతా చెదరకుండా ఉంటుంది.

మెరిసే జుట్టు కోసం: తలస్నానం చేసిన తర్వాత చివరిగా ఒక మగ్గు నీటిలో కొంచెం వెనిగర్‌, లేదా నిమ్మరసం కలిపి జుట్టును కలపండి. ఇది జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

Updated Date - Feb 18 , 2026 | 05:19 AM