దంతాల పసుపుదనం పోయేదెలా..?
ABN , Publish Date - Apr 27 , 2026 | 02:51 AM
సరిగా తోముకోకపోవడం, ఆహారపు అలవాట్ల కారణంగా దంతాలు పసుసురంగులోకి మారుతుంటాయి. వీటిని తెల్లగా మెరిపించే సులువైన చిట్కాలివే...
సరిగా తోముకోకపోవడం, ఆహారపు అలవాట్ల కారణంగా దంతాలు పసుసురంగులోకి మారుతుంటాయి. వీటిని తెల్లగా మెరిపించే సులువైన చిట్కాలివే...
చెంచా ఉప్పులో పావుచెంచా నిమ్మరసం కలిపి దాంతో దంతాలు తోముకోవాలి. రోజూ చేస్తూ ఉంటే పసుపుదనం తొలగి దంతాలు మెరుస్తాయి.
చెంచా బేకింగ్ సోడాలో పావు చెంచా నీళ్లు కలిపి పేస్టులా చేయాలి. దీంతో రోజుకు రెండుసార్లు దంతాలు తోముకుంటూ ఉంటే వారం రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.
రెండు రోజులకోసారి బొగ్గుపొడితో దంతాలు తోముకున్నా వాటిపై పేరుకున్న పాచి తొలగి తెల్లగా కనిపిస్తాయి.
రోజూ రాత్రి పడుకునేముందు అరటిపండు తొక్క లోపలి భాగంతో దంతాలను తోముకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే అరటిపండు తొక్కలోని పొటాషియం, మాంగనీస్ కలిసి దంతాలను తెల్లగా మార్చేస్తాయి.
రెండు చెంచాల స్ట్రాబెర్రీ లేదా అనాస పండు గుజ్జులో చెంచా బేకింగ్ సోడా కలిపి పేస్టులా చేయాలి. దీంతో దంతాలను తోముకుంటూ ఉంటే వారం రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.
చిన్న గిన్నెలో రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి గ్లాసు నీళ్లు పోసి కలపాలి. ఈ నీటి తో రోజుకు రెండుసార్లు నోటిని పుక్కిలిస్తూ ఉంటే దంతాలు పూర్తిగా శుభ్రపడి తెల్లగా మెరుస్తాయి.
కాఫీ, టీ, ముదురు రంగు పానీయాలను తాగడం తగ్గించాలి. పండ్ల రసాలు తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం మంచిది.
చెరుకు గడలు, యాపిల్, జామ, కేరట్‌లను ముక్కలుగా కోయకుండా వాటిని అలాగే దంతాల సహాయంతో కొరికి తినడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు
రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా
For More AP News And Telugu News