ఇంట్లోనే తామర పూలు...
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:46 AM
మిద్దె తోట, బాల్కనీ లేదా ఇంటి పరిసరాల్లో తామరపూల మొక్కను సులువుగా పెంచుకునే విధానమిదే...
మిద్దె తోట, బాల్కనీ లేదా ఇంటి పరిసరాల్లో తామరపూల మొక్కను సులువుగా పెంచుకునే విధానమిదే...
ముందుగా నాణ్యమైన విత్తనాలను తెచ్చుకోవాలి. ఇవి ఏడాదిపాటు నిల్వ ఉంటాయి కూడా. వీటి పై భాగం చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి అవి మొలకెత్తడానికి చాలా సమయం పడుతుంది. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు విత్తనాలను శాండ్ పేపర్తో మెల్లగా రుద్దుతూ లోపల ఉన్న తెల్లటి భాగం పైకి కనిపించేలా చేయాలి. తరువాత వాటిని ఒక పాత్రలో వేసి అవి మునిగే వరకు నీటిని పోయాలి. రోజూ నీటిని మారుస్తుంటే నాలుగు రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి.
లోతైన వెడల్పాటి కుండీలో సగ భాగం వరకు మెత్తటి మట్టిని వేసి అందులో కొద్దిగా కంపోస్టు కలపాలి. నీటిని చిలకరిస్తూ బురదలా తయారుచేయాలి. ఆపైన మొలకెత్తిన విత్తనాలను దూరదూరంగా నాటాలి. తరువాత కుండీని నీటితో నింపాలి.
రోజంతా కుండీకి ఎండ తగిలేలా ఏర్పాటు చేసుకోవాలి. రెండు నెలల్లో నీటి ఉపరితలంపై పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. మరో రెండు నెలల్లో తామర మొగ్గలు రావడం గమనించవచ్చు.
పసుపు రంగులోకి మారిన ఆకులను, కుళ్లినవాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. మొక్కకు క్రిమి కీటకాలు చేరకుండా ఆవ పిండి, ఆవు పేడ కలిపిన నీటిని స్ర్పే చేస్తుండాలి.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్