Share News

లవ్లీ లిప్‌స్టిక్స్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:44 AM

లిప్‌స్టిక్‌.. సౌకర్యంగా ఉండడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. అయితే మార్కెట్లో లెక్కలేనన్ని రంగుల లిప్‌స్టిక్స్‌ అందుబాటులో...

లవ్లీ లిప్‌స్టిక్స్‌

మేకప్‌

లిప్‌స్టిక్‌.. సౌకర్యంగా ఉండడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. అయితే మార్కెట్లో లెక్కలేనన్ని రంగుల లిప్‌స్టిక్స్‌ అందుబాటులో ఉన్నప్పుడు, మనకు నప్పే లిప్‌స్టిక్‌ ఎంచుకోవడమెలా? అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే...

చర్మపు రంగు ఆధారంగా నప్పే లిప్‌స్టిక్‌ ఎంచుకోవాలి. తెలుపు, చామనఛాయ, నలుపు రంగు చర్మాలకు వేర్వేరు రంగుల లిప్‌స్టిక్స్‌ నప్పుతాయి.

తెల్లని చర్మం కోసం...

బోల్డ్‌ రెడ్స్‌: బ్లూ అండర్‌టోన్‌ కలిగిన ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ తెల్లని చర్మానికి చక్కగా సూటవుతుంది

బ్లష్‌ పింక్స్‌: గులాబీ రంగు, లేదా బబుల్‌గమ్‌ రంగుల లిప్‌స్టిక్స్‌తో ముఖం తాజాదనాన్ని సంతరించుకుంటుంది

న్యూడ్‌ టోన్స్‌: తేలికపాటి బీజ్‌ లేదా పీచ్‌ రంగులు సహజసిద్ధ ఆకర్షణను తెచ్చిపెడతాయి

చామనఛాయ చర్మం కోసం...

మీడియం స్కిన్‌ టోన్‌ కలిగిన వారు విభిన్నమైన రంగుల లిప్‌స్టిక్స్‌ను ఎంచుకోవచ్చు

  • కోరల్‌, పీచెస్‌. ఈ లిప్‌స్టిక్‌ రంగులు, సహజసిద్ధ అందాన్ని తెచ్చిపెడతాయి

  • ఎర్తీ టోన్స్‌: గోధుమ రంగు, లేదా టెర్రకోటా రంగు లిప్‌స్టిక్స్‌ చక్కని మెరుపును అందిస్తాయి

  • బెర్రీ కలర్స్‌: ముదురు రాస్‌బెర్రీ, ప్లమ్‌ షేడ్స్‌ ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడతాయి

  • మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌: మీడియం టోన్స్‌ లేత, ముదురు రంగులు రెండింటినీ చక్కగా హ్యాండిల్‌ చేయలుగుతాయి. కాబట్టి వీలైనన్ని విభిన్నమైన రంగుల లిప్‌స్టిక్స్‌ను ప్రయత్నించవచ్చు

నలుపు రంగు చర్మం కోసం...

రిచ్‌గా ఉండే ముదురు రంగులు చక్కగా నప్పుతాయి

  • డీప్‌ రెడ్స్‌, వైన్స్‌: ఎరుపు లేదా బర్గండీ చాలా బాగుంటుంది

  • రిచ్‌ బెర్రీస్‌, పర్పుల్స్‌: బోల్డ్‌గా కనిపించాలంటే ఈ రెండు రంగుల లిప్‌స్టిక్స్‌ ఎంచుకోవాలి

  • చాక్లెట్‌ బ్రౌన్స్‌: ఈ రంగు సహజసిద్ధ చర్మపు రంగును ఇనుమడింపచేస్తుంది

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

Updated Date - Mar 23 , 2026 | 01:45 AM