హెయిర్ కవర్ అప్
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:56 PM
నుదుటి దగ్గర వెంట్రుకలు పలుచబడినప్పుడు, తెల్లబడినప్పుడు ఉపయోగించడానికి తోడ్పడే హెయిర్ కవర్ అప్ ఉత్పత్తులు నేడు అందుబాటులోకొచ్చాయి. పౌడర్, లిక్విడ్ రూపాల్లో..
మేకప్
నుదుటి దగ్గర వెంట్రుకలు పలుచబడినప్పుడు, తెల్లబడినప్పుడు ఉపయోగించడానికి తోడ్పడే హెయిర్ కవర్ అప్ ఉత్పత్తులు నేడు అందుబాటులోకొచ్చాయి. పౌడర్, లిక్విడ్ రూపాల్లో దొరికే ఈ ఉత్పత్తులను ఉపయోగించడం, ఫలితాన్ని రాబట్టడం ఎంతో సులభం.
కొందరికి వెంట్రుకలు పలుచగా ఉండొచ్చు. ఇంకొందరికి వయసుపైబడేకొద్దీ తల ముందు వైపు వెంట్రుకలు పులచబడిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఫ్రంట్ కట్‌తో ఆ జాగాన్ని భర్తీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ హెయిర్‌కట్‌ను ఆశ్రయించడం ఇష్టం లేని వాళ్లు, సులభంగా లోపాన్ని సరిదిద్దుకోవాలనుకునేవాళ్లు హెయిర్ కవర్ అప్ ఉత్పత్తులను ఎంచుకోవచ్చు.
కవర్ అప్ పౌడర్: పలుచబడిన ప్రదేశాన్ని వెంట్రుకల్లో కలిసిపోయేలా చేసే పౌడర్ ఇది. తెల్లబడిన వెంట్రుకలు, వెంట్రుకలు ఊడిపోయిన ప్రదేశాల్లో ఈ పౌడర్‌ను అద్దుకుని, సహజసిద్ధ లుక్‌ను సొంతం చేసుకోవచ్చు. పొడిగా ఉన్న వెంట్రుకలకు స్పాంజితో ఈ పౌడర్‌ను అద్ది, వెంట్రుకల చివర్ల వైపు బ్లెండ్ చేస్తే, పౌడర్ చక్కగా అంటుకుపోయి, నిండుతనాన్ని అందిస్తుంది
కవర్ అప్ లిక్విడ్: మస్కారాను తలపించే ఈ ఉత్పత్తిని అప్లై చేసుకోవడం ఎంతో సులభం. స్టిక్‌కు అంటుకున్న అదనపు లిక్విడ్‌ను వదిలించి, అవసరమైన చోట సున్నితంగా అప్లై చేసుకోవాలి. స్టిక్‌కు అంటుకుని ఉండే బ్రష్‌ను ఉపయోగించడం వల్ల, వెంట్రుకలను తలపించే గీతలు ఏర్పడి న్యాచురల్ లుక్ సమకూరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్