Share News

ఇలా చేస్తే మొటిమలు మాయం

ABN , Publish Date - May 18 , 2026 | 05:11 AM

ముఖంపై వచ్చే మొటిమలను గిల్లకుండా చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు..

ఇలా చేస్తే మొటిమలు మాయం

ముఖంపై వచ్చే మొటిమలను గిల్లకుండా చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు..

  • ఒక్కోసారి మొటిమలు పెద్ద దద్దుర్ల మాదిరి వచ్చి నొప్పిగా అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఐస్‌క్యూబ్స్‌తో వాటిమీద అద్దితే ఉపశనమనంగా ఉంటుంది. వాపు కూడా తగ్గుతుంది.

  • చిన్న గిన్నెలో చెంచా పసుపు, అర చెంచా తేనె వేసి కలిపి పేస్టులా చేయాలి. దీన్ని మొటిమలపైన చిన్న చుక్కలా ఉంచి అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. మూడు రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి.

  • వేపాకులను శుభ్రంగా కడిగి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లయ్‌ చేసి అరగంట తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే మొటిమల సమస్య తీరుతుంది.

  • మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే... ఒక గిన్నెలో రెండు చెంచాల ముల్తానీమట్టిని తీసుకుని అందులో తగినన్ని గులాబీ నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత మంచినీళ్లతో శుభ్రంచేసుకుంటే మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలు తగ్గుతాయి.

  • రాత్రి పడుకునేముందు మొటిమలపైన కలబంద గుజ్జు రాసి ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • చెంచా కొబ్బరి నూనెలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ కలిపి మొటిమలపైన రాస్తే నొప్పి, వాపు తగ్గుతాయి.

  • ముఖానికి తరచూ తేనె లేదా గ్రీన్‌ టీ డికాషన్‌ అప్లయ్‌ చేసుకుంటూ ఉంటే చర్మంపై సెబమ్‌ ఉత్పత్తి తగ్గి ప్రయోజనం కనిపిస్తుంది.

  • యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, మంచి నీళ్లను సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి.

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 05:11 AM