కాఫీ పొడితో ఇలా...
ABN , Publish Date - May 09 , 2026 | 04:38 AM
వేసవిలో మెరిసే చర్మం, ఒత్తయిన శిరోజాల కోసం కాఫీ పొడితో ఇలా చేస్తే సరి...
వేసవిలో మెరిసే చర్మం, ఒత్తయిన శిరోజాల కోసం కాఫీ పొడితో ఇలా చేస్తే సరి...
చిన్న గిన్నెలో రెండు చెంచాల కాఫీ పొడి, చెంచా చక్కెర, చెంచాన్నర కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముఖమంతా రాసి మెల్లగా స్క్రబ్ చేయాలి. పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మురికి, మృతకణాలు, జిడ్డు తొలగి చర్మ రంధ్రాలు శుభ్రమవుతాయి. చర్మానికి రక్త ప్రసరణ మెరుగై ముఖం ఛాయగా మెరుస్తుంది.
రెండు చెంచాల పెరుగులో చెంచా కాఫీ పొడి వేసి బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పావు గంట తరువాత ముఖాన్ని వేళ్లతో సున్నితంగా మర్ధన చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నల్ల మచ్చలు, ట్యాన్, బ్లాక్ హెడ్స్ తగ్గి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
చిన్న గిన్నెలో రెండు కొడిగుడ్ల నుంచి తీసిన తెల్ల సొన, చెంచా కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి అరగంట తరువాత మైల్డ్ షాంపూ, గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తుంటే కుదుళ్లు బలపడి శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.
పావు కప్పు కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి అందులో చెంచా కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, శిరోజాలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు నల్లగా మెరవడంతోపాటు మాడు మీద చర్మం పొడిబారకుండా ఉంటుంది.
చెంచా తేనెలో అర చెంచా కాఫీ పొడి వేసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాస్తే చర్మం తేమతో నిండి బిగుతుగా మారుతుంది. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం తాజాగా కాంతివంతంగా కనిపిస్తుంది.
రెండు చెంచాల కలబంద గుజ్జులో చెంచా కాఫీ పొడి వేసి బాగా కలిపిన మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు కళ్ల చుట్టూ అప్లయ్ చేయాలి. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే కళ్లకింద ఏర్పడిన నల్లటి వలయాలు మాయమవుతాయి. ఎరుపుదనం తగ్గి కళ్లు తెల్లగా ప్రకాశిస్తాయి.
ఇవి కూడా చదవండి:
సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!
ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్