బేకింగ్ సోడా భలే
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:10 AM
ప్రపంచంలోని అత్యంత చవకైన ఔషథమిది. ఇన్‌ఫెక్షన్లతో పాటు క్యాన్సర్‌తో పోరాడే గుణం కలిగిన ఈ వంట సోడా గురించిన ఆసక్తికరమైన...
ప్రపంచంలోని అత్యంత చవకైన ఔషథమిది. ఇన్‌ఫెక్షన్లతో పాటు క్యాన్సర్‌తో పోరాడే గుణం కలిగిన ఈ వంట సోడా గురించిన ఆసక్తికరమైన విశేషాలు
క్యాన్సర్ రక్ష
క్యాన్సర్ ఆమ్ల వాతావరణంలో వృద్ధి చెందుతుంది. బేకింగ్ సోడా, క్యాన్సర్ వృద్ధికి విరుద్ధమైన క్షార వాతావరణాన్ని సృష్టిస్తుంది. బేకింగ్ సోడా, క్యాన్సర్ కణితి పిహెచ్‌ను పెంచి, మెటాస్టాసి్‌సను తగ్గిస్తుందని 2009 అధ్యయనంలో తేలింది. కాబట్టి బేకింగ్ సోడాను ఇలా వాడుకోవాలి.
పానీయం: పావు లీటరు నీళ్లలో అర చెంచా సోడా ఉప్పు కలిపి, పరగడుపున లేదా భోజనానికీ భోజనానికీ మధ్య తీసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు ఈ సోడా నీళ్లు తాగుతూ ఉండాలి.
అసిడిటీ విరుగుడు
బేకింగ్ సోడా పొట్టలోని ఆమ్లాన్ని తక్షణమే న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి అసిడిటీ వేధిస్తున్నప్పుడు అర చెంచా సోడా ఉప్పును అరగ్లాసు నీళ్లలో కలిపి నెమ్మదిగా తాగుతూ ఉండాలి. ఐదు నిమిషాల్లో ఫలితం కనిపిస్తుంది. మందుల షాపుల్లో దొరికే యాంటాసిడ్ మాత్రలు, సిర్‌పల కంటే ఈ చిట్కా ఎంతో మెరుగైనది. యాంటాసిడ్స్‌లో మాదిరిగా దీన్లో అల్యూమినియం ఉండదు. కృత్రిమ రంగులు, రుచులు ఉండవు. ఇదెంతో చవకైనది, వేగంగా ప్రభావాన్ని కనబరుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News