Share News

10 సెకన్లు 30 బుల్లెట్లు.. ఇంటి బయటే యువకుడి దారుణ హత్య..

ABN , Publish Date - May 17 , 2026 | 06:42 PM

హర్యానాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఇంటి బయటే దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు తుపాకితో విచక్షణా రహితంగా యువకుడిపై కాల్పులు జరిపి చంపేశారు. 10 సెకన్లలో 30 బుల్లెట్లు కాల్చి యువకుడి ప్రాణాలు తీశారు.

10 సెకన్లు 30 బుల్లెట్లు.. ఇంటి బయటే యువకుడి దారుణ హత్య..
Jhajjar shooting

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడు ఇంటి బయటే దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు తుపాకితో విచక్షణా రహితంగా యువకుడిపై కాల్పులు జరిపి చంపేశారు. 10 సెకన్లలో 30 బుల్లెట్లు కాల్చి యువకుడి ప్రాణాలు తీశారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఝజ్జర్ జిల్లా, సుబానా గ్రామానికి చెందిన హితేశ్ అలియాస్ గోలుపై గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదర గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన అతడిపై నలుగురు వ్యక్తులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.


10 సెకన్లలో ఏకంగా 30 బుల్లెట్లు కాల్చారు. దీంతో హితేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. హితేశ్ ఇంటి బయట పార్క్ చేసిన కారులోకి వెళ్లి కూర్చున్నాడు. అతడి వెంట మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఇంతలో ఓ నల్ల కారు వేగంగా హితేశ్ కారు దగ్గరకు దూసుకువచ్చింది. కారులోంచి మొదట ఇద్దరు వ్యక్తులు బయటకు దిగారు. తుపాకులతో హితేశ్‌పై కాల్పులు జరపటం మొదలెట్టారు.


కొద్దిసేపటి తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు కూడా కాల్పులు మొదలెట్టారు. హితేశ్‌పై నలుగురు బుల్లెట్ల వర్షం కురిపించారు. హితేశ్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి భయపడిపారిపోయాడు. హితేశ్ చనిపోయాడని ధ్రువీకరించుకున్నాక నలుగురు వ్యక్తులు అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక, ఈ సంఘటన హర్యానాలో పెను దుమారం రేపుతోంది.


ఇవి కూడా చదవండి

ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించండి.. కేంద్రానికి సీటీఐ ఛైర్మన్ లేఖ

9 నెలల్లో 61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. ఆస్ట్రేలియాలో భారతీయుడికి 14 ఏళ్ల జైలు..

Updated Date - May 17 , 2026 | 06:45 PM