Share News

దారుణం.. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడి తలలో..

ABN , Publish Date - May 17 , 2026 | 05:02 PM

మద్యం కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో యువకుడిపై దాడి చేశారు అతడి మిత్రులు. అత్యంత పాశవికంగా యువకుడి తలలో మేకు కొట్టారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

దారుణం.. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడి తలలో..
Aligarh nail attack

లక్నో, మే 17: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మద్యం కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో యువకుడిపై దాడి చేశారు అతడి మిత్రులు. అత్యంత పాశవికంగా యువకుడి తలలో మేకు కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. అలీగఢ్ జిల్లాలోని షాపూర్ కుతుబ్ గ్రామానికి చెందిన ఓ యువకుడికి మే 15వ తేదీన అతడి మిత్రులతో గొడవ జరిగింది. మిత్రులు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని యువకుడిని అడిగారు.


ఇందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో వారు అతడితో గొడవ పెట్టుకున్నారు. విచక్షణా రహితంగా యువకుడిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే సుత్తె సాయంతో మేకును అతడి తలలో కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జవహార్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడి డాక్టర్లు చెప్పారు. కుటుంబసభ్యులు అతడిని జవహార్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు.


సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో యువకుడు తలలో మేకుతో ఉన్న దృశ్యాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

ప్రేమలేఖ రాసి.. కాంగ్రెస్ ఆఫీసులో 70కి పైగా వాష్‌రూమ్ నల్లాలు ఎత్తుకెళ్లిన వింత దొంగలు!

తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విశాల్ ఎక్స్ పోస్టు..

Updated Date - May 17 , 2026 | 05:08 PM