మిమ్మల్ని కలిసేందుకు అపాయింట్మెంట్ ఎందుకు? ఐఏఎస్‌కు వ్యక్తి ఫైర్
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:13 PM
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఐఏఎస్ అధికారిపై ఫైరైన ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చకు దారితీసింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఐఏఎస్ అధికారిపై ఫైరైన ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చకు దారితీసింది. నాగ్‌పూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఐఏఎస్ ఆఫీసర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ ఎందుకని స్థానిక జన్బద్లావ్ పార్టీకి వ్యవస్థాపకుడు యశ్ గోర్ఖెడే ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ ఫేస్బుక్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు.
ఐఏఎస్ ఆఫీసర్ ఏదో కాన్ఫరెన్స్‌లో ఉండగా గోర్ఖెడే అపాయింట్లేకుండా వెళ్లారు. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై గోర్ఖేడే ఫైరైపోయారు. ‘అపాయింట్మెంట్ ఎందుకు? మీరు పబ్లిక్ సర్వెంట్. ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్ కాదు. అందుకనే బయట నిలబడ్డా’ అని తేల్చి చెప్పారు. ప్రజాసేవకులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు.
కార్మికుల జీతం పెంపుపై మాట్లాడేందుకు ఆయన వచ్చారు. జీతాలకు సంబంధించి పీడబ్ల్యూడీ అధికారులు, కాంట్రాక్టర్లు వర్కర్లను వేధిస్తున్నారని గోర్ఖేడే రాసుకొచ్చారు. ఈ సమస్యలకు పరిష్కారం లభించకపోగా హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారు టార్గెట్‌గా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయంగా దక్కాల్సిన వేతనాలు, గౌరవం కోసం తాము పోరాడుతున్నామని చెప్పారు. కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం జరిగితే చూస్తూ ఊరుకోబోమని కూడా ఆయన హెచ్చరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500 ఛార్జీ
మహిళ కిడ్నాప్ డ్రామా.. వెలుగులోకి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం..