Share News

ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో రోడ్డుప్రమాదం, నలుగురి మృతి..

ABN , Publish Date - Jun 30 , 2026 | 10:07 AM

ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రక్కు, బస్సు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు.

ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో రోడ్డుప్రమాదం, నలుగురి మృతి..
Yamuna Expressway Accident

ఉత్తర్‌ప్రదేశ్: మధుర జిల్లాలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయా పోలీస్ స్టేషన్ పరిధిలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ ట్రక్కును బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ప్రయాణికులు మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అతి వేగమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.


సమాచారం అందిన వెంటనే రాయా స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బందీ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను వెంటనే రక్షించి అంబులెన్స్‌లో మధుర జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై మధుర ఎస్పీ (గ్రామీణ) సురేశ్ చంద్ర రావత్ స్పందించారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే మూడో లేన్‌లో ప్రయాణిస్తున్న ట్రక్కును బస్సు అతి వేగంతో ఢీకొట్టిందని ఆయన తెలిపారు.


ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు తమకు సమాచారం అందిందని ఎస్పీ రావత్ పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించామన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని తెలిపారు. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం మొత్తం సంఘటనా స్థలంలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. మరో 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని ఎస్పీ రావత్ వెల్లడించారు. ఈ ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి

చిత్తూరులో బాలిక అనుమానాస్పద మృతి

ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల తిమింగలం పిల్ల.. చివరికి..

Updated Date - Jun 30 , 2026 | 11:27 AM