Share News

సోదరిని చూడ్డానికి ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. తలపై ఊడి పడ్డ సీలింగ్ ఫ్యాన్..

ABN , Publish Date - Aug 25 , 2026 | 09:00 PM

సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన సోదరిని చూడ్డానికి వెళ్లిన మహిళకు ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. మహిళ తలపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడ్డంతో తల పగిలింది. డాక్టర్లు ఆమెకు 12 కుట్లు వేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో సోమవారం చోటుచేసుకుంది.

సోదరిని చూడ్డానికి ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. తలపై ఊడి పడ్డ సీలింగ్ ఫ్యాన్..
Jaipur SMS Hospital

ఇంటర్‌నెట్ డెస్క్: సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన సోదరిని చూడ్డానికి వెళ్లిన మహిళకు ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. మహిళ తలపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడ్డంతో తల పగిలింది. డాక్టర్లు ఆమెకు 12 కుట్లు వేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో సోమవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సంతోష్ అనే మహిళ జైపూర్‌లోని ఎస్ఎమ్ఎస్ ఆస్పత్రిలో చెవి ఆపరేషన్ చేయించుకుంది. సంతోష్‌ను చూడ్డానికి ఆమె సోదరి రీనూ దేవి ఆస్పత్రికి వెళ్లింది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సీలింగ్ ఫ్యాన్ ఊడి రీనూ తలపై పడింది.


దీంతో ఆమె తలకు తీవ్ర గాయం అయింది. డాక్టర్లు ఆమెకు 12 కుట్లు వేశారు. ఈ సంఘటనపై రీనూ కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ‘రీనూకు వైద్య సాయం అందటానికి 10 నుంచి 15 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. సంఘటన జరిగిన తర్వాత నర్సింగ్ స్టాఫ్ అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అరగంట తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఆ అంబులెన్స్‌లో రీనూను ట్రోమా సెంటర్‌కు తరలించారు. అక్కడి డాక్టర్లు రీనూ తలకు కుట్లు వేశారు. కానీ, ఆస్పత్రిలో చేర్చుకోలేదు. మళ్లీ ఆమెను ఈఎన్‌టీ ఆస్పత్రికి పంపించారు. డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి.. ఆ తర్వాతే చికిత్స అందిస్తామని చెప్పారు. కానీ, మంగళవారం ఉదయం 11 గంటల వరకు రీనూకు ఎలాంటి వైద్యసాయం అందలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

రాఖీ పండుగ 2026.. ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వకండి!

ఆపరేషన్ సిందూర్.. ఆ మిస్టరీకి తెర దించిన మాజీ సీడీఎస్

Updated Date - Aug 25 , 2026 | 09:04 PM