రాఖీ పండుగ 2026.. ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వకండి!
ABN , Publish Date - Aug 25 , 2026 | 08:34 PM
రాఖీ పండుగ పండుగకు సోదరికి బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే వాస్తు నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వకపోవడం మంచిదట.
ఇంటర్నెట్ డెస్క్: రాఖీ పండుగ సమీపిస్తోంది. తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను ఈ ఏడాది ఆగస్టు 28న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే వాస్తు, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని చెబుతారు.
తోలు వస్తువులు
తోలుతో తయారు చేసిన బూట్లు, చెప్పులు, బెల్టులు వంటి వస్తువులను రక్షా బంధన్ సందర్భంగా బహుమతిగా ఇవ్వకపోవడం మంచిదని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి. వీటిని బహుమతిగా ఇస్తే తోబుట్టువుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు.
గడియారం, చేతి రుమాలు
గడియారాన్ని సమయం, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం ద్వారా తమ మంచి సమయం లేదా అదృష్టం ఇతరులకు వెళ్లిపోతుందని కొందరు నమ్ముతారు. అలాగే చేతి రుమాలును కన్నీళ్లు, బాధకు సూచనగా భావిస్తారు. అందువల్ల రక్షా బంధన్ రోజున వీటిని బహుమతిగా ఇవ్వకపోవడం మంచిదని చెబుతారు.
నల్లటి వస్తువులు
నల్లని దుస్తులు లేదా నల్లని వస్తువులను కూడా రక్షా బంధన్ వంటి శుభ సందర్భంలో బహుమతిగా ఇవ్వకపోవడం మంచిదని కొందరు నమ్ముతారు.
ఖాళీ పర్సు లేదా వాలెట్
డబ్బు లేకుండా ఖాళీ పర్సు లేదా వాలెట్‌ను బహుమతిగా ఇవ్వడం ఆర్థిక నష్టానికి సూచనగా భావిస్తారు. పర్సును బహుమతిగా ఇవ్వాలనుకుంటే అందులో కొంత డబ్బు లేదా నాణెం పెట్టి ఇవ్వడం మంచిదని చెబుతారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు