Share News

ఆపరేషన్ సిందూర్.. ఆ మిస్టరీకి తెర దించిన మాజీ సీడీఎస్

ABN , Publish Date - Aug 25 , 2026 | 08:29 PM

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఏడాదిగా కొనసాగుతున్న ఓ మిస్టరీకి ఎట్టకేలకు తెరపడింది. పాక్ అణ్వాయుధాలు ఉన్న ప్రాంతంగా పేరున్న కిరానా కొండలపై దాడి గురించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్..  ఆ మిస్టరీకి తెర దించిన మాజీ సీడీఎస్
Ind Drona attack on Pak's Kirana Hills Nuke Facility

ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఏడాదిగా కొనసాగుతున్న ఓ మిస్టరీకి ఎట్టకేలకు తెరపడింది. పాక్ అణ్వాయుధాలు దాచి ఉంచిన ప్రాంతంగా పేరున్న కిరానా కొండలపై దాడి గురించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కిరానా హిల్స్‌లో నాటి దాడి అనుకోకుండా జరిగిందని చెప్పారు. భారత సాయుధ దళాలు ప్రయోగించిన ఓ డ్రోన్ (లాయిటరింగ్ మ్యూనిషన్) శత్రుదేశ రాడార్‌ల కోసం వెతికే సమయంలో ఇంధనం అయిపోవడంతో అనుకోకుండా ఆ కొండలను టార్గెట్ చేసిందని అన్నారు.

‘ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి అప్పట్లో చెప్పింది కరెక్టే. అసలు అప్పుడు ఏం జరిగిందంటే.. మేము పలు లాయిటర్ ఎమ్యునిషన్స్‌ను (డ్రోన్స్) సర్గోధా వైపు, ఆ ప్రాంతానికి ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరానా హిల్స్ వైపు పంపించాము. అక్కడ ఉన్న రాడార్‌లను ధ్వంసం చేయాలని అనుకున్నాము. ఈ డ్రోన్స్ సాధారణంగా రెండు గంటల పాటు గాల్లో చెక్కర్లు కొడుతూ తమ టార్గెట్స్ కోసం వెతుకుతాయి. ఈ క్రమంలోనే ఆ డ్రోన్‌లో ఇంధనం అయిపోవడంతో అనుకోకుండా హిల్స్‌ను టార్గెట్ చేసి ఉండొచ్చు’ అని అన్నారు. వాతావరణం అనుకూలంగా లేక పీఓకేలోని స్కర్దూపై చేయాల్సిన దాడిని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్టు కూడా చెప్పారు.


‘సర్గొధాను టార్గట్ చేద్దామా? అని చీఫ్ అన్న అడిగారు. నేను ఓకే చెప్పాను. అయితే, దీనికి అదనంగా మరో రెండు టార్గెట్స్‌ను ఎంచుకోమన్నాను. ఈ క్రమంలో స్కర్దూ ప్రాంతం తెరపైకి వచ్చింది. అయితే, అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో భోలారీని టార్గెట్ చేసుకునేందుకు నిర్ణయించాము’ అని జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు.

పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న సర్గొధా నగరంలో పాక్ ఎయిర్‌‌ఫోర్స్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ ఉంది. ఎఫ్-16, జేఎఫ్-17 విమానాలతో పాటు మిసైల్స్‌ను పాక్ ఇక్కడ పెడుతోంది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న కిరానా కొండల అడుగు భూగర్భంలో పాక్ ఆయుధ నిల్వ కేంద్రాలు ఉన్నట్టు సమాచారం. అక్కడ పాక్ తన అణ్వాయుధాలనూ నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ఇక, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో స్కర్దూ స్థావరాన్ని వ్యూహాత్మక వైమానిక స్థావరంగా పాక్ అభివృద్ధి చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

రష్యాలో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్ విమానం.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న మిస్టరీ

ఇరాన్‌తో వాణిజ్యం.. టాప్‌లో ఉన్న దేశం ఇదే..

Updated Date - Aug 25 , 2026 | 08:47 PM