Share News

మహిళను చంపి తినేసిన మొసలి.. 15 గంటల తర్వాత..

ABN , Publish Date - Jul 06 , 2026 | 08:17 AM

ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై ఓ మొసలి దాడి చేసింది. నదిలోకి లాక్కుపోయి తినేసింది. ఈ సంఘటన బహ్రెయిచ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

మహిళను చంపి తినేసిన మొసలి.. 15 గంటల తర్వాత..
crocodile attack Uttar Pradesh

లఖ్‌నవూ, జులై 6: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై ఓ మొసలి దాడి చేసింది. నదిలోకి లాక్కుపోయి తినేసింది. ఈ సంఘటన బహ్రెయిచ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛపారియా గ్రామానికి చెందిన 55 ఏళ్ల కేత్కీ, రమేశ్ భార్యాభర్తలు. కేత్కీ తన మేనకోడలి వివాహం కోసం శనివారం హజారీపూర్వా గ్రామం వెళ్లింది. పెళ్లి అయిపోయిన తర్వాత ఇంటికి తిరుగు పయనం అయింది. అయితే, రాత్రయినా ఆమె ఇంటికి తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకటం ప్రారంభించారు.


ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రామ్‌పూర్వా గ్రామం దగ్గర సరయూ నదిలో ఓ మొసలి మహిళ శరీరాన్ని నోట కరుచుకుని ఉండటం గ్రామస్థులు గుర్తించారు. వెంటనే పెద్ద సంఖ్యలో అక్కడ జనం గుమిగూడారు. గట్టిగా అరుస్తూ.. రాళ్లతో కొట్టడంతో మొసలి మహిళ శవాన్ని విడిచిపెట్టి లోపలికి వెళ్లిపోయింది. గ్రామస్థులు ఎంతో ధైర్యం చేసి నదిలోని మహిళ శవాన్ని బయటకు తెచ్చారు. వారు శవాన్ని బయటకు తెచ్చే సమయానికి మొసలి రెండు కాళ్లను తినేసింది. శరీరంపై లోతైన గాట్లు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


పోలీసులు మహిళ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేత్కీ పెళ్లి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నపుడు.. సరయూ నదిపై ఉన్న బ్రిడ్జి దాటుతుండగా మొసలి దాడి చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రకాశ్ చంద్ర శర్మ మాట్లాడుతూ.. ‘మహిళ మొసలి దాడి కారణంగానే చనిపోయినట్లుగా కనిపిస్తోంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఒడిశా తీరంలో క్షేమంగా ఏపీ మత్స్యకారులు

మూడేళ్ల తర్వాత రిలీజ్.. రెండు రోజుల్లోనే ఊహించని షాక్..

Updated Date - Jul 06 , 2026 | 10:02 AM