మహిళపై పాత క్లాస్‌మేట్ అకృత్యాలు.. ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో భయపెట్టి..
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:17 PM
పాత క్లేస్‌మేట్‌ను నమ్మి ఓ మహిళ దారుణంగా మోసపోయింది. మహిళ ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసిన ఆ పాత క్లాస్‌మేట్ బెదిరింపులకు దిగాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయటమే కాకుండా.. లక్షల రూపాయల సొమ్ము కాజేశాడు.
నాగ్‌పూర్, జూన్ 16: పాత క్లేస్‌మేట్‌ను నమ్మి ఓ మహిళ దారుణంగా మోసపోయింది. మహిళ ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసిన ఆ పాత క్లాస్‌మేట్ బెదిరింపులకు దిగాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయటమే కాకుండా.. లక్షల రూపాయల సొమ్ము కాజేశాడు. చివరకు పాపం పండి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగ్‌పూర్‌కు చెందిన ఓ మహిళ తన పాత క్లాస్‌మేట్ అయాజ్ మదారేను కలవడానికి 2025 ఫిబ్రవరి 8వ తేదీన ఓ హోటల్‌కు వెళ్లింది.
అయాజ్ మహిళ తాగే కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. కూల్‌డ్రింక్ తాగి మహిళ స్పృహ కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే అయాజ్ ఆమె ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని చూపించి మహిళపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. 4 లక్షల రూపాయలు దోచేశాడు. నిందితుడు అంతటితో ఆగలేదు. ఆమెను బలవంతంగా మతం కూడా మార్చాడు. రోజురోజుకు అతడి వేధింపులు ఎక్కువవటంతో మహిళ భరించలేకపోయింది. భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయాజ్‌తో పాటు అమీన్ షేక్ అనే వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నిందితుడు మహిళను వేధిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ‘నన్ను విడిచిపెట్టు’ అంటూ ఆ మహిళ అయాజ్‌ను ప్రాధేయపడుతోంది. అయినా అతడు మాత్రం ఆమెను వదల్లేదు. కాగా, బాధిత మహిళ భర్త ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
కాఫ్ సిరప్ కొనాలంటే ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పవన్ కల్యాణ్ భేటీ.. చర్చించిన అంశాలివే