Share News

శబరిమల కేసు.. జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:39 PM

శబరిమలలో మహిళలకు ప్రవేశంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 9 మంది సభ్యుల ధర్మాసనం ఎదుట సుదీర్ఘ వాదనలు నడిచాయి.

శబరిమల కేసు.. జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు..
Justice BV Nagarathna

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: శబరిమలలో మహిళలకు ప్రవేశంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 9 మంది సభ్యుల ధర్మాసనం ఎదుట సుదీర్ఘ వాదనలు నడిచాయి. విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. 'వాట్సాప్ యూనివర్సిటీ'పై సెటైర్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26ల మధ్య సమతుల్యత ఉండాలని సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ఏ మూల నుంచైనా, ఏ విశ్వవిద్యాలయం నుంచైనా వచ్చే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఆహ్వానించాలని అన్నారు. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ.. ‘కానీ.. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మాత్రం కాదు’ అంటూ చమత్కరించారు.


తప్పుడు సమాచారం ప్రబలుతున్న ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా సమాచారాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోకూడదనే అర్థంలో జస్టిస్ నాగరత్న ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజిక సంస్కరణల పేరుతో మతపరమైన ప్రాథమిక హక్కులను కాలరాయలేరని న్యాయవాది కౌల్ వాదించారు. ‘రాజ్యాంగ నైతికత’ అనేది అస్పష్టమైన పదమని, మత విశ్వాసాలను దీనితో కొలవలేమని దావూదీ బోహ్రా వర్గం న్యాయవాది అన్నారు. జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. మతపరమైన హక్కులు ఎప్పుడూ నైతికత, ప్రజారోగ్యం, శాంతిభద్రతలకు లోబడే ఉంటాయని గుర్తుచేశారు.


ఇవి కూడా చదవండి

ఐదేళ్ల తర్వాత.. చైనీయులకు భారత్ పర్యాటక వీసాలు..

హైదరాబాద్‌‌లో మరో దగుల్బాజీ దందా.. భారీగా కల్తీ టీ పౌడర్ బట్టబయలు!

Updated Date - Apr 23 , 2026 | 05:49 PM