యూజర్‌నేమ్స్‌పై ఆందోళన వద్దు!
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:29 AM
యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం ఇచ్చిన నోటీసుకు వాట్సాప్ స్పందించింది. తాము కొత్తగా ప్రతిపాదించిన ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల...
ప్రముఖులు, ప్రముఖ సంస్థల యూజర్‌నేమ్స్‌ను ఎవరెవరో రిజర్వ్ చేసుకోకుండా నియంత్రించాం
వాటిని పోలిన యూజర్‌నేమ్స్‌నూ నిలిపివేశాం: వాట్సాప్
న్యూఢిల్లీ, జూలై 2: యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం ఇచ్చిన నోటీసుకు వాట్సాప్ స్పందించింది. తాము కొత్తగా ప్రతిపాదించిన ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల యూజర్‌నేమ్స్‌ను, అలాగే ప్రముఖ సంస్థల యూజర్‌నేమ్స్‌ను ఎవరెవరో రిజర్వ్ చేసుకుంటున్నారనే వాదన తప్పని స్పష్టం చేసింది. అలాంటి వార్తలు అబద్ధం అని కొట్టిపారేసింది. ఆయా యూజర్‌నేమ్స్‌ను సదరు ప్రముఖులు (లేదా) ఆయా సంస్థలు మాత్రమే రిజర్వ్ చేసుకునేలా తాము నియంత్రిస్తున్నట్టు తెలిపింది. ఈ ఫీచర్‌కు సంబంధించి వ్యక్తమవుతున్న సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసే ప్రశ్న-సమాధానాలను (ఎఫ్‌ఏక్యూ) వాట్సాప్ విడుదల చేసింది. ‘‘పాపులర్, ప్రముఖ యూజర్‌నేమ్స్‌ను ఎవరెవరో రిజర్వ్ చేసుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. అలాంటి యూజర్‌నేమ్స్‌ను అసలు యజమానులు మాత్రమే రిజర్వ్ చేసుకోగలరు’’ అని తేల్చిచెప్పింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ద్వారా యూజర్‌నేమ్స్‌ను రిజర్వ్ చేసుకునే ప్రక్రియ మాత్రమే జరుగుతోందని.. ఈ ఫీచర్ ఇంకా అధికారికంగా వినియోగంలోకి రాలేదని, ఈ ఏడాది చివరిలోపు అధికారికంగా అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ అధికారి ప్రతినిధి పేర్కొన్నారు. ‘‘ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, ఇప్పటికే ధ్రువీకరించిన మెటా ఖాతాల యూజర్‌నేమ్స్‌ను వేరొకరు రిజర్వ్ చేసుకునే వీలు లేకుండా వాటిని మేం నిలిపివేశాం. వాటిని చట్టబద్ధమైన యజమానులు మాత్ర మే పొందగలరు. అంతేకాదు.. ప్రముఖ వ్యక్తుల, సంస్థల పేర్లను పోలిన యూజర్‌నేమ్స్‌ను కూడా మేం నిలిపేశాం’’ అని ఆయన వివరించారు. అలాంటి యూజర్‌నేమ్స్‌ను ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలని ప్రయత్నిస్తే.. అవి అందుబాటులో లేవనే సమాధానమే వస్తుందని వాట్సాప్ పేర్కొంది. కొత్త వ్యక్తులెవరైనా మనకు వాట్సాప్‌ద్వారా సందేశం పంపాలనుకుంటే వారికి మన యూజర్ నేమ్ కచ్చితంగా తెలిసి ఉండాల్సిందేనని వెల్లడించింది. అలా గే.. ఒక ఖాతా ద్వారా ఎంత మంది కొత్త వ్యక్తులను సంప్రదించవచ్చనే దానిపైనా పరిమితులు విధించాం.
యూజర్‌నేమ్స్‌ను ఊహించడానికి ఎవరై నా పదేపదే ప్రయత్నాలు చేస్తే గుర్తించి బ్లాక్ చేస్తాం. వేరేవ్యక్తుల్లా నటించే, ఇబ్బంది పెట్టేలా వ్యవహరించే ఖాతాలను గుర్తించి, తొలగించే వ్యవస్థనూ ఏర్పాటు చేశాం’’ అని వాట్సాప్ పేర్కొంది. యూజర్ నేమ్‌తో మనను ఎవరైనా సంప్రదిస్తే.. ఆ వ్యక్తి కొత్తవారా? మన కాంటాక్ట్‌లిస్టులో ఉన్నవారా? లేక మనతోపాటు వేరేదైనా వాట్సాప్ గ్రూపులో ఉ న్నారా? లేక విదేశాల నుంచి ఆ మెసేజ్ చేస్తున్నా రా? అనే విషయాన్ని ముందే చూపుతామని వెల్లడించింది. తద్వారా ఆ మెసేజ్‌కు స్పందించాలా వద్దా అనే నిర్ణయం వినియోగదారులే తీసుకోవచ్చని తెలి పింది. అలాగే.. యూజర్‌నేమ్‌ను వినియోగించడం తప్పనిసరి కాదని, అక్కర్లేదనుకున్నవారు యథాప్రకారం తమ నంబర్‌తో వాట్సా్‌పను వినియోగించుకోవచ్చని పేర్కొంది. కాగా.. వాట్సా్‌పకు కేంద్రం నోటీసులు పంపడంపై.. డిజిటల్ హక్కుల కోసం పోరాడే ‘ఇంటర్‌నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్’ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కంపెనీ ఏయే ఫీచర్లను అభివృద్ధి చేసి, మార్కెట్లోకి విడుదల చేయాలో నిర్ణయించే అధికా రం ప్రభుత్వానికి లేదని తప్పుబట్టింది. ఏ చట్టమూ ప్రభుత్వానికి అధికారం ఇవ్వలేదని పేర్కొంది.
ఆ రెండింటికీ..
యూజర్‌నేమ్స్ వ్యవహారంపై ఇప్పటికే వాట్సాప్‌కు నోటీసులు ఇచ్చిన కేంద్రం.. తాజాగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్‌కి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ ఫీచర్ దుర్వినియోగంపై వాట్సా ప్‌కు సంధించిన ప్రశ్నలనే ఈ రెండింటికీ కేంద్ర ఐటీశాఖ సంధించినట్టు సమాచారం. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్‌లో ఎప్పట్నుంచో యూజర్‌నేమ్స్ పీచర్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది