ముస్లిం ఓట్లను చీల్చేందుకు రూ.వెయ్యి కోట్లు!
ABN , Publish Date - Apr 11 , 2026 | 06:28 AM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ(ఏజేయూపీ) చీఫ్ హుమాయున్ కబీర్‌కు చెందిన ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను అధికార తృణమూల్ కాంగ్రె్‌స...
బీజేపీ ఆఫర్ ఇచ్చిందంటూ హుమాయున్ కబీర్ మాట్లాడిన వీడియోను విడుదల చేసిన టీఎంసీ
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ(ఏజేయూపీ) చీఫ్ హుమాయున్ కబీర్‌కు చెందిన ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను అధికార తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ) విడుదల చేయగా.. అది రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గతేడాది టీఎంసీ సస్పెండ్ చేయడంతో కబీర్ ఏజేయూపీని స్థాపించారు. టీఎంసీ తాజాగా విడుదల చేసిన వీడియోలో కబీర్ మాట్లాడుతూ.. ‘ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా మమతా బెనర్జీని ఓడించేందుకు బీజేపీ రూ.1,000 కోట్లు ఆఫర్ చేసింది. ఇప్పటికే రూ.200 కోట్లు అడ్వాన్స్‌గా అందాయి. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు సువేందు అధికారి, అసోం సీఎం హిమంతతో టచ్‌లో ఉన్నాను’ అని అన్నట్లుగా ఉంది. కాగా, కబీర్ చేసిన వ్యాఖ్యలపై ఈడీ దర్యాప్తు జరపాలని టీఎంసీ డిమాండ్ చేసింది. ‘ముస్లింల సమగ్రతను దెబ్బతీసే పార్టీలతో పొత్తు పెట్టుకోలేం. ఏజేయూపీతో తెగదెంపులు చేసుకున్నాం. ఒంటరిగానే బరిలోకి దిగుతాం’ అని అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ‘ఎక్స్’లో ప్రకటించింది. ఇటు కబీర్ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. అది ఏఐ వీడియో అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..
బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్