యమధర్మరాజు రెస్ట్‌లో ఉన్నట్లున్నాడు.. కొద్దిలో తప్పించుకున్నాడు..!
ABN , Publish Date - Aug 18 , 2026 | 04:33 PM
పశ్చిమ బెంగాల్‌లోని కలింపాంగ్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో ఓ బైకర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బిందు ప్రాంతంలో ఒక్కసారిగా కొండపై నుంచి మట్టి, రాళ్లు, శిథిలాలు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కలింపాంగ్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో ఓ బైకర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బిందు ప్రాంతంలో ఒక్కసారిగా కొండపై నుంచి మట్టి, రాళ్లు, శిథిలాలు భారీగా రోడ్డుపైకి దూసుకొచ్చాయి. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న బైకర్ వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వెనకాలే ఉన్న ఇతర ప్రయాణికులు ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. ఎత్తైన కొండలు ఉన్న రహదారి వెంట పలు వాహనాలు వెళ్తున్నాయి. అదే సమయంలో ఓ బైకర్ కొండ వద్దకు చేరుకోగానే.. ఒక్కసారిగా భారీగా మట్టి పెళ్లలు, రాళ్లు దూసుకొచ్చాయి. ప్రమాదాన్ని గుర్తించిన బైకర్ వెంటనే తన వాహనాన్ని వెనక్కి మళ్లించాడు. దీంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
కొండచరియలు విరిగిపడటంతో బిందు ప్రాంతంలోని ప్రధాన రహదారిపై భారీగా శిథిలాలు పేరుకుపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆకస్మికంగా కొండ కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. బ్రదర్‌కు భూమ్మీద నూకలున్నాయని కొందరు.. మోస్ట్ లక్కీ పర్సన్ అని మరికొందరు.. యమధర్మరాజు రెస్ట్‌లో ఉన్నాడేమో అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. పర్వత ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే ప్రమాదంలో చిక్కుకుంటారంటూ మరికొందరు నెటిజన్లు జాగ్రత్తలు చెబుతున్నారు.
Also Read:
ఏపీలో 6,534 టీచర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: మంత్రి సవిత