Share News

దేశవ్యాప్తంగా ‘ఓట్‌ బచావో - దేశ్‌ బచావో’ఉద్యమం: జైరాం

ABN , Publish Date - Oct 06 , 2026 | 02:26 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌), సీఈసీ జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని.. ఏఐసీసీ అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా  ‘ఓట్‌ బచావో - దేశ్‌ బచావో’ఉద్యమం: జైరాం
JAiRAMRAMESH

న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌), సీఈసీ జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని.. ఏఐసీసీ అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 25 వరకు ఓట్‌ బచావో, దేశ్‌ బచావో, సీఈసీ హటావో పేరిట ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సోమవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ మీడియాతో మాట్లాడారు. తెలిపారు. ఈ సమయంలో ఓటు హక్కును కోల్పోయిన, కోల్పోయే ముప్పును ఎదుర్కొంటున్న వారిని బూత్‌ స్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కలుసుకుని.. తిరిగి వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించడానికి కృషి చేస్తారని చెప్పారు. నవంబరు 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌ వేదికగా మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘చలో ఢిల్లీ’ పేరుతో భారీ వాహన ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 02:30 AM