ఐదేళ్లలో లక్ష మంది ఉద్యోగుల తొలగింపు
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:23 AM
కార్ల తయారీకి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఫోక్స్‌వాగన్ కంపెనీ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా 2030కల్లా ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మంది...
ఖర్చు తగ్గించుకునేందుకు ఫోక్స్‌వాగన్ యోచన
సంస్థకు మొత్తం 6.67లక్షల మంది ఉద్యోగులు
జర్మనీలో 4 ఫ్యాక్టరీల మూత: సీఈవో బ్లూమర్
ఐదేళ్లలో లక్ష మంది ఉద్యోగుల తొలగింపు
ఖర్చులు తగ్గించుకునేందుకు ఫోక్స్‌వాగన్ ఆలోచన
చైనా ఈవీల నుంచి పోటీ, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే
న్యూఢిల్లీ, జూన్ 26: కార్ల తయారీకి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఫోక్స్‌వాగన్ కంపెనీ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా 2030కల్లా ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. దీంతో పాటు, జర్మనీలో నాలుగు ఫ్యాక్టరీలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కంపెనీ సీఈవో ఒలివర్ బ్లూమ్ ‘ఫోక్స్‌వాగన్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక’ను ఇటీవల ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందు పెట్టారు. జూలై 9న జరిగే కంపెనీ సూపర్‌వైజరీ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. చైనా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కంపెనీల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీ, అమెరికా సుంకాల బెడద, ఐరోపా దేశాల్లో కార్ల ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిపోవడమే ఉద్యోగుల తొలగింపునకు కారణంగా తెలుస్తోంది. ఫోక్స్‌వాగన్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6.67లక్షల మంది ఉద్యోగులున్నారు. అందులో దాదాపు లక్ష మంది అంటే 15ు మందిని తొలగించనున్నారు. 89ఏళ్ల వోక్స్‌వాగన్ చరిత్రలో ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ ఉద్యోగులను తొలగించలేదు. ఫోక్స్‌వాగన్ మొత్తం ఉద్యోగుల్లో ఒక్క జర్మనీలోనే 43ు మంది ఉన్నారు. అంటే ఎక్కువ ప్రభావం జర్మనీలోని ఉద్యోగులపైనే పడే అవకాశం ఉంది. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఫోక్స్‌వాగన్ సంస్థ ఫోక్స్‌వాగన్, ఆడి, పోర్షే, లాంబోర్గిని, బెంట్లీ లాంటి లగ్జరీ కార్లతో పాటు స్కానియా టిప్పర్లు, డుకాటీ టూవీలర్లను తయారు చేస్తోంది.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..