ఇది కదా సక్సెస్ అంటే.. కళ్లు లేకపోయినా టెన్త్‌లో టాప్ ర్యాంక్..
ABN , Publish Date - Apr 17 , 2026 | 09:21 PM
కంటి చూపు సరిగా లేని ఓ బాలిక చదువులో అద్భుతాలు సృష్టిస్తోంది. ఎంతో మంది బాలబాలికలకు స్పూర్తిగా నిలుస్తోంది. టెన్త్ పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించి దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకుంది.
శ్రీనగర్, ఏప్రిల్ 17: కంటి చూపు సరిగా లేని ఓ బాలిక చదువులో అద్భుతాలు సృష్టిస్తోంది. ఎంతో మంది బాలబాలికలకు స్పూర్తిగా నిలుస్తోంది. టెన్త్ పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించి దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకుంది. పదో తరగతి పరీక్షల్లో అద్భుతాలు సృష్టించిన ఆ బాలిక పేరు జైనబ్ బిలాల్. ఆమెది జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతం. 16 ఏళ్ల జైనబ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదివింది. తాజాగా, టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చాయి. ఆ పరీక్షల్లో ఆమెకు 95 శాతం మార్కులు వచ్చాయి.
500 మార్కులకు గాను 475 మార్కులు సాధించింది. కంప్యూటర్ సైన్స్‌లో నూటికి నూరు మార్కులు వచ్చాయి. అంతేకాదు.. జైనబ్ మీద ఓ రికార్డు కూడా ఉంది. ల్యాప్‌టాప్ సాయంతో సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన కంటి చూపు సరిగా లేని మొదటి విద్యార్థిని జైనబ్ కావటం విశేషం. జైనబ్ సక్సెస్ వెనుక ఆమె తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది. కూతురి చదువుకోసం వారు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.
కూతురు సాధించిన ఈ ఘన విజయంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జైనబ్ చదువులో మాత్రమే కాకుండా.. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా సత్తా చాటుతోంది. 12 సంవత్సరాల వయసులోనే జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు.. రేడియో డీఎస్పీ కార్యక్రమం కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను కూడా ఇంటర్వ్యూ చేసింది.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..