బెలూన్‌తో టెలీకమ్యూనికేషన్ సేవలు
ABN , Publish Date - May 14 , 2026 | 05:35 AM
దేశంలో తొలిసారిగా అత్యంత ఆధునిక సూపర్ ప్రెజర్ బెలూన్ (ఎస్‌పీబీ)ని రెడ్ బెలూన్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. విజయవాడకు చెందిన ఈ సంస్థ బుధవారం తమ...
విజయవాడ సంస్థ ఎస్‌పీబీ ట్రయల్ రన్ సక్సెస్
విజయవాడ, మే 13(ఆంధ్రజ్యోతి): దేశంలో తొలిసారిగా అత్యంత ఆధునిక సూపర్ ప్రెజర్ బెలూన్ (ఎస్‌పీబీ)ని రెడ్ బెలూన్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. విజయవాడకు చెందిన ఈ సంస్థ బుధవారం తమ బెలూన్ ట్రయల్‌ను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజయవంతంగా నిర్వహించింది. ఈ బెలూన్‌ను నియర్ స్పేస్ (భూమి పైన 20-40 కి.మీ)లోకి పంపింది. ఈ బెలూన్‌లోని సెన్సార్లు అందించే అన్ని సిగ్నల్స్‌ను బేస్ స్టేషన్ నుంచి పరీక్షించారు. బెలూన్‌లో హైడ్రోజన్‌ను నింపి ఎగుర వేశారు. మారుమూల గిరిజన ప్రాంతాలు, తీరప్రాంతాల్లో టెలీకమ్యూనికేషన్ సేవలు అందించడానికి ఆధునిక టెక్నాలజీతో దీనిని రూపొందించారు. భూమిపైన ఉన్న వస్తువులను 25 నుంచి 75 సెంటీమీటర్ల రిజల్యూషన్‌తో చిత్రించగల శక్తివంతమైన కెమెరా, సెన్సార్‌లతో కూడిన 20 కిలోల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎస్‌పీబీని నియర్ స్పేస్‌లో ఉంచారు. గగనతలం నుంచి భూఉపరితలానికి సంబంధించిన సమాచారం, సిగ్నల్స్‌ను బేస్ స్టేషన్‌కు అందజేసింది. ట్రయల్ విజయవంతం కావడం పట్ల రెడ్ బెలూన్ ఏరోస్పేస్ సీవోలు డాక్టర్ సీవీఎస్ కిరణ్, శిరీ్‌షలను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధులు అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్