Share News

టీవీకేకు మద్దతిస్తామన్న పళనిస్వామి

ABN , Publish Date - May 07 , 2026 | 07:41 AM

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి టీవీకేకు మద్దతు ఇవ్వాలని భావించారు. ఆ మేరకు అన్నాడీఎంకే...

టీవీకేకు మద్దతిస్తామన్న పళనిస్వామి

తీవ్రంగా వ్యతిరేకించిన అన్నాడీఎంకే సీనియర్లు

చెన్నై, మే 6(ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి టీవీకేకు మద్దతు ఇవ్వాలని భావించారు. ఆ మేరకు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్‌ బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. 47 మంది ఎమ్మెల్యేలున్న అన్నాడీఎంకేతో ఐదేళ్లపాటు సుస్థిరమైన ప్రభుత్వం కావాలో, చిల్లరమల్లర పార్టీలతో కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వం కావాలో టీవీకే తేల్చుకోవాలన్నారు. బంతి విజయ్‌ కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ పళనిస్వామితో భేటీ అయ్యారు. అయితే, పళనిస్వామి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే సీనియర్‌ నేతలైన ఎస్‌పీ వేలుమణి, సీవీ షణ్ముగం, కేపీ మునుస్వామి తదితర 30 మంది ఎమ్మెల్యేలు వేరే శిబిరంలో భేటీ అయ్యారు. నిజానికి బుధవారం ఉదయం 9.30 గంటలకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం జరగాల్సి ఉంది. కానీ పళనిస్వామి నిర్ణయం గ్రహించిన సీనియర్లు వేరే సమావేశం నిర్వహించారు. దీంతో వెనక్కి తగ్గిన పళనిస్వామి... వారందరినీ తన ఇంటికి రప్పించుకుని శాంతింపజేశారు. టీవీకేకు మద్దతు నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని కేపీ మునుస్వామి బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 07:42 AM