Share News

ఏటా 6 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:28 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ ఆ రాష్ట్ర మహిళలకు భారీగా హామీలు ఇచ్చారు....

ఏటా 6 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

  • గృహిణులందరికీ నెలకు 2,500.. ఉచిత బస్సు ప్రయాణం

  • తమిళనాడు మహిళలపై విజయ్‌ హామీల జల్లు

చెన్నై, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ ఆ రాష్ట్ర మహిళలకు భారీగా హామీలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని గృహిణులకు నెలకు రూ. 2500లు ఇస్తామని, ఏటా 6గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని, పేద యువతుల పెళ్లికి 8 గ్రాముల బంగారాన్ని అన్నయ్య కానుకగా ఇస్తానని ప్రకటించారు. మహాబలిపురంలోని ఓ స్టార్‌హోటల్‌లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక కామరాజర్‌ విద్యా సహాయ పథకం కింద 1 నుంచి 12 వరకు నిరాటంకంగా చదివించే తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఏటా రూ. 15 వేలను ఇస్తామని చెప్పారు. మహిళలకు అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి..

ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ

Updated Date - Mar 08 , 2026 | 04:28 AM