విజయ్ కాన్వాయ్ మాయం!
ABN , Publish Date - May 07 , 2026 | 07:07 AM
ఎన్నికల ఫలితాలు వెలువడిన సాయంత్రం నుంచి పోలీసు కాన్వాయ్, కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరుగుతున్న...
చెన్నై, మే 6(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫలితాలు వెలువడిన సాయంత్రం నుంచి పోలీసు కాన్వాయ్, కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరుగుతున్న టీవీకే చీఫ్ విజయ్ పరిస్థితి బుధవారం రాత్రికి మారిపోయింది. ఆయన కాన్వాయ్ మాయమైపోయింది. పోలీసుల హడావుడి కూడా తగ్గిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితే దీనికి కారణమని తెలుస్తోంది. బుధవారం రాత్రి పొద్దు పోయాక విజయ్ తన పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లారు. సొంతకారు వెనుక తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్న మరొక్క వాహనం మాత్రమే ఉంది. ఈ సమయంలో చాలా విజయ్ ముభావంగా కనిపించారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ