ఐదేళ్ల బాలుడిపై టీచర్ దారుణం.. కాల్చిన కత్తితో వాత పెట్టి..
ABN , Publish Date - Jul 27 , 2026 | 05:35 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్యాంట్స్‌లో మూత్రం పోశాడన్న కోపంతో ఉపాధ్యాయురాలు ఘాతుకానికి ఒడిగట్టింది. కాల్చిన కత్తితో బాలుడి ప్రైవేట్ పార్టుపై వాత పెట్టింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్యాంట్స్‌లో మూత్రం పోశాడన్న కోపంతో ఉపాధ్యాయురాలు ఘాతుకానికి ఒడిగట్టింది. కాల్చిన కత్తితో బాలుడి ప్రైవేట్ పార్టుపై వాత పెట్టింది. జులై 24వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు.. వారణాసికి చెందిన కేసరీ జైశ్వాల్ దంపతుల ఐదేళ్ల కుమారుడు పాండేపూర్‌లోని సరీన్ సోనీ ప్లే స్కూల్‌లో చదువుతున్నాడు. జులై 24వ తేదీన బాలుడు ఇంటికి రాగానే ప్రైవేట్ పార్ట్ వద్ద నొప్పిగా ఉందని తల్లికి చెప్పాడు.
బాలుడి ప్రైవేట్ పార్టుపై వాత ఉండటం చూసి తల్లి షాక్ అయ్యింది. ఏం జరిగిందని కుమారుడిని అడిగింది. బాలుడు తన తల్లితో.. ‘మూత్రం వస్తోందని టీచర్‌కు చెప్పాను. ఆమె నన్ను బాత్‌రూముకు వెళ్లనివ్వలేదు. నేను ప్యాంట్స్‌లోనే మూత్రం పోసుకున్నాను. టీచర్ నన్ను వేరే గదిలోకి తీసుకెళ్లింది. స్టవ్‌పై కత్తిని కాల్చి నాకు వాత పెట్టింది’ అని చెప్పాడు. ఆగ్రహానికి గురైన బాలుడి తల్లిదండ్రులు మరుసటి రోజు స్కూలు దగ్గరకు వెళ్లారు. బాలుడికి వాత పెట్టిన ఉపాధ్యాయినిపై చర్యలు తీసుకోవాలని స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
వారినుంచి సరైన స్పందన రాకపోవటంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పిల్లాడికి వాత పెట్టిన ఉపాధ్యాయిని ప్రీతీ కూశ్వాహతో పాటు ప్రిన్సిపల్, స్కూలు యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ సంఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ‘ఇది చాలా దారుణమైన సంఘటన. బాలుడు బతికున్నంత కాలం ఇది అతడిపై ప్రభావం చూపుతుంది’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
నిరసనకారులపై బలప్రయోగాన్ని సమర్థించలేం: సుప్రీంకోర్టు
ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా? ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం