యూపీలో వర్షాల బీభత్సం..
ABN , Publish Date - May 14 , 2026 | 05:22 AM
ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో బుధవారం బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు మిగిల్చాయి....
31 మంది మృతి
భదోహీ/ఫతేపుర్, మే 13: ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో బుధవారం బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు మిగిల్చాయి. భదోహీ, ఫతేపుర్, బదౌన్, సోన్‌ఽభద్ర జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. భదోహీ జిల్లాలో భారీ ఈదురుగాలుల ధాటికి పలు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలగా, ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. బదౌన్ జిల్లాలో ఓ ఇంటి మట్టిగోడ కూలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుపాను ప్రభావంతో విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్