Share News

అన్షుల్‌ హంతకుల సమాచారమిస్తే

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:44 AM

అమెరికాలో హత్యకు గురైన తెలంగాణ యువకుడు కుంచ అన్షుల్‌ (28) కేసులో హంతకుల గురించి సమాచారం ఇచ్చినవారికి...

అన్షుల్‌ హంతకుల సమాచారమిస్తే

20 వేల డాలర్లు ఇస్తామన్న అమెరికా పోలీసులు

న్యూయార్క్‌, జూన్‌ 7: అమెరికాలో హత్యకు గురైన తెలంగాణ యువకుడు కుంచ అన్షుల్‌ (28) కేసులో హంతకుల గురించి సమాచారం ఇచ్చినవారికి 20వేల డాలర్ల (సుమారు రూ.19 లక్షలు) రివార్డు అందజేస్తామని ఫిలడెల్ఫియా పోలీసులు ప్రకటించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్‌.. శుక్రవారం అర్ధరాత్రి పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేసి వస్తుండగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని కాల్చిచంపారు. కాగా, అన్షుల్‌ పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన ఇంట్లో ఎవరూ ఉండడం లేదని పోలీసులు గుర్తించారు. అన్షుల్‌ను రప్పించేందుకే ఖాళీగా ఉంటున్న ఇంటి చిరునామాతో పిజ్జా ఆర్డర్‌ ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పిజ్జా ఆర్డర్‌ వచ్చిన ఫోన్‌ నంబర్‌ను పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 05:44 AM