Share News

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు మరో షాక్‌!

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:44 AM

అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే భారతీయుల కష్టాలు మరింత పెరగనున్నాయి. గ్రీన్‌కార్డు దరఖాస్తులను ఆమోదించే సమయంలో...

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు మరో షాక్‌!

  • ‘పబ్లిక్‌ చార్జ్‌’ నిబంధన విస్తరణ.. 18 నుంచి అమల్లోకి

  • నిబంధనలతో భారతీయ టెక్‌ నిపుణులపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ, ఆగస్టు 20: అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే భారతీయుల కష్టాలు మరింత పెరగనున్నాయి. గ్రీన్‌కార్డు దరఖాస్తులను ఆమోదించే సమయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు పరిగణనలోకి తీసుకొనే అంశా ల పరిధిని ట్రంప్‌ సర్కారు మరింత విస్తృతం చేసింది. ‘పబ్లిక్‌ చార్జ్‌’ నిబంధన నిర్వచనాన్ని విస్తరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం అందించే వైద్యసాయం, ఆహారం, గృహవసతి, ఇతర సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందుతున్న వలసదారుల గ్రీన్‌కార్డు దరఖాస్తులను తిరస్కరించే విధంగా కఠిన నిబంధనలు రూపొందించింది. ఈ మేరకు యూఎ్‌ససీఐఎస్‌ జారీచేసిన సవరణ ఫ్రేమ్‌వర్క్‌ సెప్టెంబరు 18నుంచి అమలులోకి రానుంది. అమెరికాలో శాశ్వతనివాసం కోసం నిరీక్షించేవారిలో భారతీయులే అధికంగా ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం వీరిపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 06:44 AM