గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై మరో పిడుగు!
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:58 AM
అమెరికాలో శాశ్వత నివాసం కోరుకొనే భారతీయుల కష్టాలు మరింత పెరగనున్నాయి. ఈ నెల 18 నుంచి అమలులోకి రానున్న నూతన విధానం ప్రకారం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేవారి ఆర్థిక స్థితిని అధికారులు మరింత నిశితంగా పరిశీలించనున్నారు.
నేటినుంచి కొత్త ‘పబ్లిక్ చార్జ్’ నిబంధన అమలులోకి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: అమెరికాలో శాశ్వత నివాసం కోరుకొనే భారతీయుల కష్టాలు మరింత పెరగనున్నాయి. ఈ నెల 18 నుంచి అమలులోకి రానున్న నూతన విధానం ప్రకారం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేవారి ఆర్థిక స్థితిని అధికారులు మరింత నిశితంగా పరిశీలించనున్నారు. భవిష్యత్తులో వారు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం లేదా సంక్షేమ పథకాలపై ఆధారపడే అవకాశం ఉందా? అనే అంశాన్ని ప్రధానంగా అంచనా వేస్తారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం నిరీక్షించేవారిలో భారతీయులే అధికంగా ఉన్న నేపథ్యంలో తాజా నిబంధనలు వీరిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా డబ్బులు కట్ అయ్యాయా? ఇలా చేయండి